Chiranjeevi Workout | జిమ్‏లో 69 ఏళ్ల వ‌య‌సులో చెమటలు చిందిస్తోన్న మెగాస్టార్..

allroudadda

Chiranjeevi Workout | చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుండడంతో చిత్రీకరణలో పాల్గొనేందుకు చిరంజీవి సన్నద్ధమవుతున్నారు. సరికొత్త లుక్‌లో కనిపించేందుకు జిమ్‌లో కసరత్తు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను గురువారం ఆయన సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

‘విశ్వంభర’ కోసం సిద్ధమవుతున్నానని ఆ వీడియోలో చిరంజీవి తెలిపారు. యువీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.అయితే చిరంజీవి 68 ఏళ్ళ వయసులోనూ యంగ్ స్టార్స్ తో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు.

చిరంజీవి ప్రత్యేక కసరత్తులు..

allroudadda
allroudadda

కెరీర్ స్టార్టింగ్ లో ఎంత కష్టపడ్డారో అగ్ర నటుడిగా ఎదిగిన తర్వాత కూడా అదే స్థాయిలో కష్టపడుతూ తనకి తానే సాటి అనిపించుకుంటున్నారు. తాజాగా ‘విశ్వంభర’ చిత్రం కోసం చిరంజీవి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. పాత్రకి తగ్గట్టుగా తన శరీరాన్ని మలుచుకోవడం కోసం గ్రాఫిక్స్ ని నమ్ముకోకుండా.. కష్టాన్ని నమ్ముకున్నారు. ‘విశ్వంభర’ సినిమా కోసం మెగాస్టార్ చేస్తున్న వర్కౌట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టేస్టీ తేజ కి గుండెపోటు..హాస్పిటల్ కి వెళ్ళే సమయంలో..

ఇంతకంటే సాధించడానికి ఏమీ లేదు అనే స్థాయికి చిరంజీవి ఎప్పుడో చేరుకున్నారు. కోట్ల మంది అభిమానుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న ఆయనను ఇటీవల పద్మ విభూషణ్ కూడా వరించింది. అయినప్పటికీ ఆయన నిత్య విద్యార్థిలా సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నారు. 68 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలను తలదన్నేలా వర్కౌట్స్ చేస్తున్నారు. ఆయనను చూసి ఈ తరం హీరోలు ఎంతో నేర్చుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply