Latest Photo | అప్పట్లో చిరు ఫేవరెట్‌ హీరోయిన్‌.. ఇప్పుడు చూసి షాకవుతున్న ఫ్యాన్స్‌

allroudadda

Latest Photo | అప్ప‌ట్లో తెలుగింటి అమ్మాయిలు చాలామంది హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయ్యారు. స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టారు. ఆ లిస్ట్ లో హీరోయిన్ మాధవి కూడా ఉంటారు. ఈ అందాల తార విజ‌య‌శాంతి, జ‌యసుధ‌, జ‌య‌ప్ర‌ధ లాంటి స్టార్ హీరోయిన్ ల‌కు పోటీ ఇచ్చారు. అంతే కాకుండా మొదటి సినిమాతోనే ఈ భామ చిరంజీవికి జోడీగా న‌టించే అవ‌కాశాన్ని అందుకుంది. చిరంజీవి హీరోగా న‌టించిన ప్రాణం ఖ‌రీదు సినిమాతో మాధ‌వి హీరోయిన్ గా ప‌రిచ‌యమైంది.

ఇక మొద‌టి సినిమాతోనే మాధ‌వి కుర్రాళ్ల ఫేవ‌రెట్ హీరోయిన్ గా మారిపోయింది. మ‌రోవైపు చిరంజీవికి సైతం ఈ హీరోయిన్ ఫేవ‌రెట్ జోడీగా మారిపోయింది. ప్రాణం ఖ‌రీదు సినిమా త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌, చ‌ట్టంతో పోరాటం, మ‌ర‌ణ‌శాస‌నం, బిగ్ బాస్ ఇలా చాలా సినిమాల‌లో హీరోయిన్ గా న‌టించింది.ముఖ్యంగా ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపొద పాటలో మెగాస్టార్‌తో పోటీపడి మరీ డ్యాన్స్ చేసింది అందాల తార.

allroudadda
allroudadda

అదే సమయంలో మాతృదేవోభవ సినిమాలో తన అద్భుతమైన అభినయంతో అందరితో కంటతడి పెట్టించింది. అప్పట్లోనే ఓ సినిమాలో బికినీలో కనిపించి కుర్ర గారు మతులు పోగొట్టిందామె. చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి లాంటి స్టార్‌ హీరోలతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. అలాగే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది.

Aditi Rao – Siddharth | సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకొన్న హీరో సిద్దార్థ్, అదితి..?

కాగా సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మ్యాన్ రాల్ఫ్ శర్మను మాధవి వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు అమెరికాలోనే స్థిరపడ్డారు. వీరికి టిఫాని శర్మ, ప్రసిల్లా శర్మ, ఎవ్లీన్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మాధవి తన భర్తకు ఉన్న ఔషధాల సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారట. అలాగే ఫుడ్‌ రెస్టారెంట్‌ బిజినెస్‌లోనూ రాణిస్తున్నారట. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ మాత్రమే ఫొటోలు షేర్‌ చేస్తున్నారు మాధవి. తాజాగా తన భర్త పుట్టిన రోజును పురస్కరించుకుని తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ఇందులోని చాలా ఫొటోల్లో ఆమె గుర్తుపట్టలేకుండా ఉంది. ఆమె లుక్‌ని చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

Recent Posts

Leave a Reply