శుభవార్త మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్..!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పేద ప్రజలకు సహాయం చేయడానికి కొంతమంది సినీస్టార్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు. సెకండ్ వేవ్ కారణంగా ఎంతోమంది ఆక్సిజన్ లేక మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి 30 కోట్ల రూపాయలకు పైగా సొంత డబ్బులు ఖర్చు చేసి ఆక్సిజన్ బ్యాంక్ లను ఏర్పాటు చేశాడు.

అలాగే సినీ కార్మికులకు వ్యాక్సిన్ వేయించాడు,ఇక తాజాగా మరో మహోత్తర కార్యక్రమంకు శ్రీకారం చుట్టబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తుంది.వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరంజీవి అనుకుంటున్నారట. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.ప్ర‌స్తుతం చిరు ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 152వ సినిమా పై మెగా అభిమానులలో రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మెగాఫాదర్ సన్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్డి రాంచరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ కేవలం 15రోజులు మాత్రమే బాలన్స్ ఉన్నట్లు టాక్.

ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తుండగా.. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే రాంచరణ్ జోడిగా కనిపించనుంది. ఇక మెగాస్టార్ జోడిగా రెండోసారి కాజల్ అగర్వాల్ నటిస్తోంది.ఈ సినిమా పూర్తయ్యాక లూసిఫర్, వేదాళం రీమేక్‌లు చేయనున్నాడు. బాబీ దర్శకత్వంలోను చిరు ఓ సినిమా చేస్తున్నాడు. ఇచ్చేఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించనున్నాడు మెగాస్టార్.