Rakesh Master : కన్నీళ్లతో వచ్చిన గణేష్ మాస్టర్.. రాకేష్ మాస్టర్ పిల్లల బాధ్యత మాది..!

టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ మరణవార్త అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. కాగా రాకేశ్‌ మాస్టర్‌.. ముక్కురాజు మాస్టర్ వద్ద కొన్నాలు శిష్యరికం చేశారు. ఆ తరువాత ఆట, ఢీ వంటి డ్యాన్స్‌ షోలతో కెరీర్ లో ముందుకు వెళ్లారు. ఢీ షోతో మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు.

అలా టాలీవుడ్ లోని పలు సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కంపోజ్ చేశారు.లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వు, అమ్మో పోలీసోళ్ళు వంటి సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కోరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు. ఇక ఈయన దగ్గర ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే.

వారిలో జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) కూడా ఉన్నారు. అంతేకాదు వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష వంటి స్టార్స్ డాన్స్ పాఠాలు కూడా నేర్పించారు.ఈక్రమంలో గణేష్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. రాకేష్‌ మాస్టర్‌ ఫ్యామిలీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
‘టాలీవుడ్‌ డ్యాన్స్‌ ఇండస్ట్రీకి, మాకు రాకేష్‌ మాస్టరే పెద్ద దిక్కు. ఆయన ఎక్కడున్నా, ఎవరికీ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ సహాయం చేసేవారు. కరోనా సమయంలో కూడా ఎంతోమందికి ఆపన్న హస్తం అందించారు.

మేం మాస్టర్‌తో తో కలిసి పని చేసినా, చేయకపోయినా డ్యాన్స్‌ పరంగా ఆయన మాకెప్పుడూ గురువే. ఆయన తన శిష్యులకు డ్యాన్స్‌ నేర్పించి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు.

ఇప్పుడూ వాళ్లందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి అందరం కలిసి ఆయన ఫ్యామిలీకి అండగా నిలబడతాం. ఈ విషయంపై డ్యాన్స్‌ మాస్టర్లు అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుంటాం. అలాగే యూనియన్‌తో కలిసి తప్పకుండా రాకేష్‌ మాస్టర్‌ ఫ్యామిలీకి తగిన సహాయం చేస్తాం ‘అని గణేష్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చారు.

Leave a Reply