సినీ పరిశ్రమలో మరో విషాదం.. కొరియోగ్రాఫర్‌ రాజేష్‌ మాస్టర్‌ ఆత్మహత్య..!

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజేష్‌ మాస్టర్‌ కన్నుమూశారు. అతనిది సహజ మరణం కాదని, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.అయితే సూసైడ్‌కు గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖ డ్యాన్స్ గ్రూప్ ఎలక్ట్రో బ్యాటిల్స్ ను రాజేష్ స్థాపించారు. ఫెఫ్కా డ్యాన్స్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గానూ ఉన్నారు. నటి బీనా ఆంటోనీ రాజేష్ మాస్టర్ ఫొటోని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి, అతడు తీసుకున్న రెండో నిర్ణయం ఎంతో నష్టానికి దారితీసిందంటూ పోస్ట్ పెట్టారు.

మరణానికి గల కారణం ఏంటని అభిమానులు ఆమెను ఇన్ స్టా గ్రామ్ లో ప్రశ్నించగా.. ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందంటూ బదులిచ్చారు.రాజేష్ మరణ వార్త తనను షాక్ కు గురి చేసినట్టు ప్రముఖ నటి దేవి చందనా స్పందన వ్యక్తం చేశారు. సినిమాటిక్, బాలీవుడ్ డ్యాన్స్ ను తన జీవితంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

Leave a Reply