ప్రాణం తీసిన ప్లాస్టిక్ సర్జరీ.. అసలు ఏం జరిగింది అంటే..?

రంగుల ప్రపంచమైన సినిమా రంగంలో రాణించాలంటే అందం, అభినయం తప్పని సరి. శరీరాకృతి, అందం కోసం నటీ నటులు పలు అవయవాలకు ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. మేకోవర్ కోసం బాలీవుడ్ నుండి మాలీవుడ్ హీరో హరోయిన్లు అనేక మంది సర్జరీలు చేయించుకున్నవారే. కానీ ఇవి కొన్నిసార్లు వికటించి.. ప్రాణం మీదకు తెచ్చిన ఘటనలు ఎన్నో. దివంగత నటి శ్రీదేవి లిప్ సర్జరీ చేయించుకోగా.. మూతి వాచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల కన్నడ నటి చేతన రాజ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోగా.. వికటించి ప్రాణం పొగొట్టుకుంది.

మొన్నటికి మొన్న బిటీఎస్ గాయకుడు జిమిన్‌లా కనిపించేందుకు 12 ఆపరేషన్లు చేయించుకున్న కెనడీయన్ నటుడు శాండ్ వాన్ మృతి చెందాడు. తాజాగా మరో నటి చిన్న వయస్సులో అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. అయితే దీనికి కూడా సర్జరీలే కారణమని తెలుస్తోంది.బాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ లాగా కనిపించే మోడల్ క్రిస్టినా ఆష్టన్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. 34 సంవత్సరాల వయస్సులో ఆమె మరణించింది. కిమ్ కర్దాషియాన్ హాలీవుడ్ నటి.

ఆమె అందానికి జనాలు పిచ్చెక్కిస్తున్నారు. ఆయనలా కనిపించాలని చాలా మంది ఆశపడుతుంటారు. మోడల్ క్రిస్టినాకు కూడా ఇదే కోరిక కలిగింది. అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయడం ద్వారా కిమ్ వంటి ఆకృతిని, ముఖాన్ని పొందింది. శస్త్రచికిత్స తర్వాత, ఆమె సరిగ్గా కిమ్ లాగా కనిపించడం ప్రారంభించింది. దీంతో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది.కిమ్‌లా కనిపించడానికి అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న తర్వాత, ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే, క్రిస్టెన్ కేవలం 34 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించింది. కిమ్ కర్దాషియాన్ లాగా అందంగా కనిపించేందుకు క్రిస్టెన్ రూ.11.12 కోట్లు వెచ్చించింది. దీంతో అతని కాస్మెటిక్ సర్జరీ జరిగింది. అయితే అప్పటి నుంచి ఆయనకు అనేక వైద్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి. కొద్దిరోజుల తర్వాత కిమ్ కర్దాషియాన్‌లా కనిపించిన క్రిస్టెన్ మృతి చెందడం ఆమె అభిమానులను కూడా కలిచివేసింది.

Leave a Reply