allroudadda

CM YS Jagan | కేసీఆర్ ఇంటికి సీఎం జగన్.. 2024 గెలుపు కోసమేనా..

CM YS Jagan | ఏపీ సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వెళ్లారు. ఇటీవల కాలుజారి పడి, తుంటి ఎముక శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఏపీ సీఎం జగన్… ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.ఇద్దరు నేతలు ఏకాంతంగా 45 నిమిషాల పాటు చర్చలు జరిపారని తెలిసింది.

ఏపీ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాం, లోక్ సభ ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన లోపం.. మెజార్టీ సీట్లను సిట్టింగులకు ఇవ్వడం. దీంతో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైంది. 64 సీట్లతో రేవంత్ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ (Jagan) దృష్టిసారించారు.

గులాబీ బాస్ చెప్పిన గుణపాఠాలు

allroudadda
allroudadda

CM YS Jagan ఇప్పటికే సిట్టింగులను దూరం పెడుతున్నారు. రెండు విడతల్లో దాదాపు 50 మందికి టికెట్లు ఇవ్వనని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి జగన్‌కు కేసీఆర్ పలు సూచనలు చేశారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తప్పులు చేయొద్దని చెప్పారని తెలిసింది. అంటే కేసీఆర్ నుంచి ఓటమి గుణపాఠాలు జగన్‌కు గట్టిగానే అందాయన్న మాట.ప్రధానంగా సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ఒక అంశం.. ఎన్నికల వ్యుహకర్తలతో ప్రచారం మరో అంశంగా మారింది.

కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల..చిరుకి నాకు చాలా తేడా ఉంది..

ఏదీ ఏమైనప్పటికీ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్ హితోపదేశం చేశారని తెలిసింది. లోక్ సభ ఎన్నికల్లో పరస్పర సహకారంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చిందట. తెలంగాణలో వైసీపీ బీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రాలో బీఆర్ఎస్ వైసీపీకి సపోర్ట్ చేసేలా ప్రతిపాదన వచ్చిందని విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి, పార్టీని విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కూడా కేసీఆర్- జగన్ మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇలా వివిధ అంశాలపై 45 నిమిషాల పాటు చర్చించారు. గులాబీ బాస్ చెప్పిన గుణపాఠాలు జగన్‌కు ఏమాత్రం పనికొస్తాయో.. ఆయన ఎంత పాత్రం పాటిస్తారో చూడాలి మరి.

Leave a Reply