CM Revanth Reddy | ‘కుమారి ఆంటీ’ ఫుడ్ సెంటర్ మూసివేత.. రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి..

allroudadda

CM Revanth Reddy | కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ. నగరంలోని మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. మొదట్లో కేవలం 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి ఫుడ్‌ బిజినెస్‌.. ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందట!. ప్రేమగా వడ్డించే ఆమె విధానంతో పాటు అక్కడి రేట్లు కూడా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆమె ఓ సెన్సెషన్‌గా మారిపోయారు.అయితే తాజాగా ఆమెకు షాక్‌ ఇచ్చారు పోలీసులు.

ఆమె ఫుడ్‌ కోర్టును బంద్‌ చేయించగా.. తనకు మాత్రమే బంద్‌ చేయించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఏ సోషల్‌ మీడియా అయితే ఆమెను ఫేమస్‌ చేసిందో.. అదే ఆమెకు దెబ్బేసింది. ఆమె వీడియోలు వైరల్‌ అయ్యాక ఆ ఫుడ్‌ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్‌తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్‌ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.

రహస్యంగా బర్రెలక్కకు రైతు బిడ్డకు పెళ్లి..?

దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. వారం పాటు దుకాణం బంద్‌ చేయాలని.. ఈలోపు జీహెచ్‌ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్‌ కోర్టు తెరుచుకోవాలని ఆమెకు సూచించారు.అయితే తాజాగా తెలంగాణలో ఓ ఫుడ్ సెంటర్ మూసివేత ఏపీలో పార్టీల మధ్య వివాదం రేపింది.. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు.

allroudadda
allroudadda

ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ప్రస్తుతం ఏపీలో రాజకీయ రచ్చకు దారితీసింది. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను పోలీసులు మూసివేయించిన విషయం తెలిసిందే. దీనికి యూట్యూబర్లు, మీడియానే కారణమని నెటిజన్లు మండిపడుతుండగా.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు మూసివేయించారో తెలియట్లేదని కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు.. మండిపడుతున్న చిరంజీవి..

అయితే తాజాగా కుమారి ఆంటీ’కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించ్చుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్‌ను తాను సందర్శిస్తానని సీఏం రేవంత్ తెలిపారు.

Leave a Reply