నేనింతే హీరోయిన్ భర్త ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

శియా గౌతమ్ అంటే కాస్త ఆలోచిస్తాం ఎవరబ్బా అని.. అదే రవితేజ సినిమా నేనింతే హీరోయిన్ అంటే టక్కున గుర్తుకొస్తది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఫీల్డ్ లోకి రావడానికి, అక్కడ రకరకాల స్థాయిల్లో పనిచేసే వ్యక్తులు ఎదుర్కొనే పరిస్థితుల నడుమ ఈ సినిమా కథ నడుస్తూ ఉంటుంది. 2008లో ఈ సినిమా విడుదలయి మంచి హిట్ కొట్టింది.తన తొలి సినిమా ఇది దాంతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది శియా గౌతమ్.

శియా గౌతమ్ అసలు పేరు అతిథి గౌతమ్. పుట్టింది పెరిగింది అంతా ముంబైలో.. తొలి చిత్రమైన నేనింతే తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడంతో శియా గౌతమ్ కి పూర్తిగా అవకాశాలు రావడం మానేశాయి.ఆ తర్వాత హిందీ, కన్నడ చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికి అక్కడ ఈ భామ క్లిక్ కాలేకపోయింది.

అలా ఈ బామ్మ నెమ్మ నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతున్న తరుణంలో సుదీర్ఘ కాలం తర్వాత గోపీచంద్ – మారుతి కాంబోలో వచ్చిన పక్కా కమర్షియల్ మూవీలో ఒక చిన్న పాత్రలో నటించింది. ఇదిలా ఉంటేతాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది అంటూ పెళ్లి ఫోటోలు ఒకసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ అదితి గౌతమ్ పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

అదితి గౌతమ్ బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా మైకేల్ పల్కీవాలా అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది.ఇక ఆ అబ్బాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ముంబైకి చెందిన ఓ బడా బిజినెస్ మాన్ అని తెలుస్తోంది.విరిది ప్రేమ పెళ్లా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా తెలియదు కానీ ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అలాగే వీరి పెళ్లికి టాలీవుడ్ నుండి ప్రియమణి దంపతులు హాజరైనట్టు తెలుస్తోంది. వీరికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఏది ఏమైనప్పటికి చాలామంది టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోయిన్లు హీరోలు ఒక్కొక్కరిగా పెళ్లి బాట పట్టడం వారి అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది.

Leave a Reply