Divorce: నిహారిక బాటలో త్వరలో మరో స్టార్ హీరోయిన్ విడాకులు..?

Swathi Reddy

కలర్స్ స్వాతి (Colours Swathi) పరిచయం అవసరం లేని పేరు. కెరియర్ మొదట్లో పలు చానలలో యాంకర్ గా పనిచేస్తున్నటువంటి కలర్స్ స్వాతి అనంతరం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశాలను అందుకున్నారు. ఈమె వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో ఆయన మరదలు పాత్రలో నటించి మెప్పించారు. ఈ విధంగా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈమె అనంతరం హీరోయిన్గా అవకాశాలు అందుకున్నారు.

ఇలా హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కలర్స్ స్వాతి పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జంటల పెళ్లిళ్లు పెటాకులు అవుతున్న సంఘటనలు ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ రోల్ చేసే నటులంతా తమ వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నారు.నాగ చైతన్య- సమంత, నోయిల్-ఎస్తర్, నిహారిక- చైతన్య వంటి జంటలు విడిపోతున్నామనే వార్త..

ఎన్నో రోజులుగా మీడియాలో నాన్చుతూ చివరకి కన్ఫామ్ చేస్తున్నారు. మీడియాకు లీకులు ఇస్తున్నట్లుగా ముందే సోషల్ మీడియాలో.. తమ తమ పార్ట‌నర్స్ ‌ఫోటోలను డిలీట్ చేయడం, లేదంటే బ్లాక్ చేయడం వంటివి చేస్తూ హింట్ ఇస్తున్నారు. తాజాగాఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు లేకపోవడంతో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. తన భర్త వికాస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి స్వాతి తొలగించడం హాట్ టాపిక్‌గా మారింది.

ఎందుకంటే.. గతంలో సమంత, నాగచైతన్యతో విడిపోయేటప్పుడు ఇలాంటి పనే చేసింది. రీసెంట్‌గా మెగా డాటర్ నిహారిక కూడా ఇలాగే చేసింది. ఇక ఇప్పుడు వీళ్ల దారిలోనే స్వాతి కూడా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది వ్యవహారం. అందుకే స్వాతి విడాకుల బాటలో వెళ్తుందనే టాక్ ఊపందుకుంది.అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి అంటే స్వాతి స్పందించాల్సి ఉంది.

Leave a Reply