కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ఎవరో మీకు తెలుసా..! టాలీవుడ్‌లో స్టార్ హీరో…

గోదావరి యాస, తనదైన శైలి మాటకారితనంతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మీపతి. రైటర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి.. ఆ తర్వాత పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించారు ఈయన. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. కమెడియన్‌గా దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘అల్లరి’ చిత్రం లక్ష్మీపతికి మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది.

అలాగే తన తమ్ముడు డైరెక్టర్‌గా వ్యవహరించిన ‘బాబీ’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్‌లో నటించారు లక్ష్మీపతి. ఇంతకీ లక్ష్మీపతి ఓ డైరెక్టర్‌కి అన్న అవుతాడని మీకు తెలుసా.? ‘వర్షం’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన శోభన్.. లక్ష్మీపతి తమ్ముడు. ప్రస్తుతం శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు.లక్ష్మీపతి తొలుత టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా తన కెరీర్ ప్రారంభించారు.

ఆ తర్వాత తన తమ్ముడు శోభన్ డైరెక్ట్ చేసిన బాబీ సినిమాలో నెగటివ్ షేడ్‌లో కనిపించి.. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ‘అల్లరి’, ‘అమ్మాయిలు.. అబ్బాయిలు’, ‘తొట్టిగ్యాంగ్’, ‘పెదబాబు’, ‘కితకితలు’, ‘అందాల రాముడు’, ‘అత్తిలి సత్తిబాబు LKG’ లాంటి సినిమాల్లో తనదైన శైలి కామెడీ టైమింగ్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు లక్ష్మీపతి. అయితే సరిగ్గా సినిమాల్లో బిజీ అవుతున్న సమయంలోనే లక్ష్మీపతికి అనూహ్యంగా గుండెపోటు రావడం.. ఆ తర్వాత అకాల మరణం చెందటం జరిగింది.

ఇదిలా ఉంటే.. లక్ష్మీపతికి శ్వేతా, కేతన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే ఆయన తమ్ముడు కొడుకైన సంతోష్ శోభన్ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు. తొలుత ‘గోల్కొండ హైస్కూల్’లో క్రికెట్‌ టీంకు కెప్టెన్‌గా విద్యార్ధి రోల్‌లో మెప్పించిన సంతోష్ శోభన్.. ఆ తర్వాత ‘పేపర్ బాయ్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. అలాగే ఇటీవల ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాతో సంతోష్ శోభన్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

Leave a Reply