విషమంగా పంచ్ ప్రసాద్.. ఈ ఫోన్ పే నంబర్ కి మీకు కూడా సహాయం చేయండి..!

జబ‌ర్ద‌స్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పంచ్ ప్ర‌సాద్(Punch Prasad ) ఒక‌రు. ఈయ‌న కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే.. పంచ్ ప్ర‌సాద్ గ‌త కొంత‌కాలంగా కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. రెగ్యుల‌ర్‌గా డ‌యాసిస్ చేయించుకుంటున్నారు. చికిత్స‌తో కోలుకుని కొన్నాళ్లు జ‌బ‌ర్ద‌స్త్‌లో క‌నిపించారు.

కాగా ఇప్ప‌డు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియెన్ నూక‌రాజు(Jabardasth Emmanuel) సోషల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, వెంటనే ఆయనకు సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పినట్లు నూకరాజు వెల్లడించాడు. కాగా సర్జరీ కోసం బాగా డబ్బు ఖర్చవుతుందని, దానికి ఆర్థికంగా డబ్బు సహాయం చేసే దాతల కోసం ఎదురు చూస్తున్నట్లు నూకరాజు వీడియోలో తెలిపాడు.

ప్రసాద్ కు రెండు కిడ్నీలు పాడవడంతో వేరే సమస్యలు కూడా తనను వెంటాడుతున్నాయని, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతుందని నూకరాజు చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే సర్జరీ చేస్తే తనకు ఎలాంటి ప్రమాదం లేదని, దానికోసం ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చేయవచ్చని ప్రసాద్ భార్య బ్యాంక్ డిటేయిల్స్, ఫోన్ పే నంబర్ ను వీడియోలో మెన్షన్ చేశాడు.

Leave a Reply