అయ్యో పాపం.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్..! ఎవరంటే..?

ఇప్పుడంటే తగ్గిపోయారు గానీ వేరే ఏ ఇండస్ట్రీలోనూ లేనంత మంది కమెడియన్స్ తెలుగులోనే ఉన్నారు. అలా ఓ ఫేడౌట్ అయిన హాస్యనటుడు చాలారోజుల తర్వాత ఓ రియాలిటీ షోలు సందడి చేశారు. ఫ్యాన్స్ ఆయన్ని చూసి హ‍్యాపీగా ఫీలవుతున్నారు.ఇప్పటి జనరేషన్ కు సుధాకర్ Comedian Sudhakar అంటే పెద్దగా తెలియకపోవచ్చు.

కానీ ఓ 15-20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. కమెడియన్ గా మనల్ని తెగ నవ్వించిన ఆయన గత కొన్నేళ్లలో బయట ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య కొన్నిరోజుల ముందు సుధాకర్ చనిపోయారనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది.

వాటిని కొట‍్టిపారేస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ ‘నేను నాన్న’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. నటుడిగా 45 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకు గానూ సుధాకర్‌ను Sudhakar ఈ షో వద్దకు తీసుకొచ్చిన నిర్వాహకులు సన్మానించారు. ఆయనతో కలిసి కేక్ కూడా కట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్‌గా మారింది.

ఈ ప్రోమోలో కమెడియన్ సుధాకర్‌ని మొదటిసారి చూసినప్పుడు చాలా మంది గుర్తుపట్టలేదు . ఆ తర్వాత తను చేసిన సినిమాలు, జనాలను నవ్వించే సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదు. దీంతో సన్నబడి గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. ఏది ఏమైనా ఆయన ఇలా షోకి వచ్చి అందరితో కలిసి ఎంజాయ్ చేయడం హ్యాపీ గా అనిపించింది.

Leave a Reply