Comedian | నడవలేని స్థితిలో స్టార్ కమెడియన్.. మీరు గుర్తుపట్టరా.

allroudadda

Comedian | ఒకానొక సమయంలో తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు సుధాకర్ కొన్ని కారణాలవల్ల తమిళ చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా వెలివేయబడ్డారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన కమెడియన్ గా స్థిరపడ్డారు. ఇలా కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారు. కమెడియన్ సుధాకర్ వయసు పై పడటంతో ఈ మధ్యకాలంలో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయనకు కాస్త అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో అందరూ కూడా అనారోగ్య సమస్యలతో ఈయన మరణించారని భావించారు. అయితే ఎన్నోసార్లు సుధాకర్ తాను బ్రతికే ఉన్నానని క్షేమంగా ఉన్నానని చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.ఐతే ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఒకవైపు వృద్ధాప్యం మరోవైపు ఆరోగ్య కారణాలవల్ల ఆయన బక్క చిక్కిపోయారు.

Comedian | వివాహానికి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం..

allroudadda
allroudadda

అయితే ఇటీవలే సుధాకర్ Comedian Sudhakar కుమారుడి బెన్నీ వివాహం సందర్భంగా.. తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అప్పటికి ఇప్పటికీ సుధాకర్ అభిమానుల సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అని చెప్పాలి. ఇక ఈ వివాహానికి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం నటులు జగపతిబాబు, జెడి చక్రవర్తి, ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు. అయితే మా అభిమాన నటుడు సుధాకర్ ఇలా అయ్యాడేంటి.. ఇంతకీ ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి అని తెలుసుకునేందుకు అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

allroudadda
allroudadda

Recent Posts

Leave a Reply