వాళ్ళ వల్లే చైతన్యపై అలా చేసుకున్నాడు..! పల్సర్ బైక్ ఝాన్సీ ఫైర్

తెలుగు బుల్లితెర డాన్స్ షో ఢీ మాస్టర్ చైతన్య ఆత్మహత్యకు సంబంధించి అనేక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పుల భారంతోనే మాస్టర్ చైతన్య ఆత్మహత్యకు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్సర్ బైక్ ఝాన్సీ అసలు వాస్తవాలను బయటపెట్టారు. చైతన్య అప్పులకు అసలు కారణం ఇదేనన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన చైతన్యకు రావాల్సిన పేమెంట్స్ ఆపేయడమే కారణమని ఝాన్సీ తెలిపారు.

గత ఏడాది డిసెంబర్ 31న కండెక్ట్ చేసిన ప్రోగ్రాంలో కొంతమంది ఆర్టిస్టులు చైతన్యకు హ్యాండిచ్చారని దీంతో ఈవెంట్ ఆర్గనైజర్స్ మాస్టర్ కు రావాల్సిన అమౌంట్ ను ఆపేశారని దాని వల్ల ఆయన అప్పు చేశారని..దాన్ని తీర్చేందుకు మరో అప్పు..ఇలా అప్పులు చేసుకుంటూ పోయారని చివరకు ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారంటూ కండక్టర్ ఝాన్సీ కన్నీళ్ల పర్యాంతం అయింది.

ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఆ ఆర్టిస్టులతో కూర్చొని మాట్లాడి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఝాన్సీ అభిప్రాయపడింది. మొత్తానికి, ఝాన్సీ చేసిన వ్యాఖ్యలతో చైతన్య సూసైడ్ వెనుక అసలు కారణాలు బయటపడ్డాయి.ఈ సందర్భంగా ఝాన్సీ ఈవెంట్ నిర్వాహకులకు రిక్వెస్ట్ చేశారు.. ఆరోగ్యం బాగోలేకున్నా వచ్చి షో చేస్తాము.. మా పర్ఫార్మెన్స్ నచ్చకుంటే మరోసారి పిలవకండి.. అంతేగానీ.. ఇలా పేమెంట్స్ ఆపవద్దని ఝాన్సీ అన్నారు.

Leave a Reply