Corona | మళ్లీ భారత్‌లో మొదలైన కరోనా.. ఈసారి వస్తే అంతే సంగతులు..

allroudadda

Corona | భారత్‌లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ఆదివారం దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో ఐదుగురు కరోనాతో మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మృతుల్లో నలుగురు కేరళ వాసులు కాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి కరోనాతో కన్నుమూశారు.ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇప్పటివరకూ దేశంలో మొత్తం 4.50 కరోనా కేసులు వెలుగుచూశాయి.

4.46 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో, జాతీయ సగటు రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైంది. కొవిడ్ మరణాల సంఖ్య 5,33,316గా ఉంది. అంతేకాకుండా, ఇప్పటివరకూ 220.67 కోట్ల కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేశారు.కరోనా కూడా ఇలానే నెమ్మదిగా వచ్చి ఆ తర్వాత ఊహకందనీ రీతిలో శరవేగంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

allroudadda
allroudadda

అయితే ఇది మునుపటి వేరియంట్ల కంటే తీవ్రమైన అంటువ్యాది కావొచ్చా..? లేదా అనేది సందిగ్ధంలో ఉంది. ఈ కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండటం అనేది కీలకమే కానీ భయపడాల్సిన అవసరం లేదని పలువురు నిపుణులు పేర్కొంన్నారు. ఇప్పటి వరకు రోగుల్లో దీనికి సంబంధించి.. జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, జీర్ణశయాంతర సమస్యలు వంటి లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు. అయితే ఈ కొత్త వేరియంట్ బారిన పడిన రోగులు త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోతుండటం అందరిలో ఉపశమనం కలిగిస్తుంది.

Leave a Reply