చిత్ర పరిశ్రమలో మరో విషాదం..! కృష్ణ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. చెన్నైలోని స్వగృహంలో కృష్ణ తుదిశ్వాస విడిచారు. విశాఖకు చెందిన ఆయన పూర్తి పేరు మాదాసు కృష్ణ. తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రెస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ ఆయనే సమకూర్చేవారు. సురేష్​ ప్రొడక్షన్స్​లో ఎన్నో సినిమాలకు ఆయన పనిచేశారు.

ఆ టైమ్​లో ఆయన్ను అందరూ ‘సురేష్’ కృష్ణ అనేవారు. ఆ తర్వాత కాస్టూమ్స్ కృష్ణ అనే పేరు స్థిరపడింది. ‘భారత్​ బంద్​’తో నటుడిగా పరిచయడం అయ్యారాయన. ఆ మూవీకి అయిష్టంగానే ఆయన ఓకే చెప్పారు. కానీ ఆ తర్వాత చాలా సినిమాల్లో ఇష్టంతో నటించి అందర్నీ మెప్పించారు.‘పెళ్లాం చెబితే వినాలి’, ‘పోలీస్ లాకప్’,

‘అల్లరి మొగుడు’, ‘దేవుళ్లు’, ‘మా ఆయన బంగారం’, ‘విలన్’, ‘శాంభవి ఐపీఎస్’, ‘పుట్టింటికి రా చెల్లి’ తదితర చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు కాస్ట్యూమ్స్ కృష్ణ. నిర్మాతగానూ తన అభిరుచికి తగిన చిత్రాలు తీశారు. అయితే ఎంత కష్టపడినా ప్రొడ్యూసర్​గా లాభాలు రాలేదని ఓ సందర్భంలో ఆయన వాపోయారు.

Leave a Reply