భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు.. కానీ, కలలో కూడా ఊహించని ప్రమాదం..! ఏం జరిగింది అంటే.

ఆ యువకుడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ కోసం భారీగా ప్లాన్ చేశాడు.. అనుకున్నట్లుగానే తన భార్యను తీసుకుని హనీమూన్ ట్రిప్ వెళ్ళాడు పాపం చివరికి ఇద్దరు అక్కడే ప్రాణాలు వదిలారు.. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే. లోకేశ్వరన్ అనే వ్యక్తి విబ్నిశియా అనే యువతిని ఈ నెల ఒకటవ తేదీన వివాహం చేసుకున్నాడు.

వృత్తి రీత్యా ఈ ఇద్దరు కూడా డాక్టర్లే. అయితే పెళ్లి తర్వాత కొత్తజంట హనీమూన్ కు వెళ్లాలి అనుకున్నారు. ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తే.. ఇండోనేషియా మంచి ప్లేస్ అని వారికి అనిపించింది. దీంతో వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని ఇండోనేషియా కు పయనం అయ్యారు.

ఇక ఈనెల తొమ్మిదవ తేదీన అక్కడ సముద్రంలో సరదాగా మోటార్ బోట్ పై విహరించారు ఈ నూతన వధూవరులు. కానీ అక్కడే వారి కోసం మృత్యువు ఎదురుచూస్తుంది అని మాత్రం ఊహించలేకపోయారు. బోటు ఒక్కసారిగా తిరగబడటంతో సముద్రంలో పడి చనిపోయారు. అయితే వధువు మృతదేహం ఇంకా లభించలేదు. ఇలా పెళ్లైన పది రోజులకే వధూవరులు ఇద్దరు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అరణ్య రోదనగా విలపించారు.

Leave a Reply