Carona New |అలర్ట్.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్ళీ లాక్ డౌన్.

allroudadda

Carona New  | రోజు రోెజుకి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి.. నిన్నటి వరకూ దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరుకుంది. గత 24 గంటల్లో ఏకంగా 328 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో సైతం 3 కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ కేసులు పాత వేరియంట్ వా? లేక కొత్త వేరియంట్ వా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల 5 వేలకుపైగా మందికి కరోనా సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇక కరోనాతో లక్ష 18వేల మంది ఆస్పత్రిపాలైయ్యారు.అటు నెల రోజుల వ్యవధిలో 3 వేల మందికిపైగా జనాలు కరోనా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1తో వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో భూమ్మీద నూకలుండాలంటే మళ్లీ ముక్కుకు నోటీకి మస్ట్‌గా మాస్క్ పెట్టాల్సిందే. దేశంలో కరోనా పరేషాన్‌ చేస్తోంది. తప్పిపోయిందీ అనుకున్న ముప్పు.. రూపం మార్చి మళ్లీ విజృంభిస్తుంది.

allroudadda
allroudadda

Carona New  | మళ్ళీ లక్ డౌన్ తప్పదేమో

Carona New  | దేశంలో కొత్త వేరియంట్ JN-1 తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇక దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు, ఒకరు మృతి చెందినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. కేరళ, కర్నాటక, తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. దేశంలో 3,742 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, తెలుగురాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్‌ JN-1 మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 38 యాక్టివ్ కేసులు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 18కి చేరాయి.

ALSO READ : అతను నన్ను గదికి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన షకీలా?

మెదక్‌ జిల్లాలో కూడా కరోనా మరోసారి కలవరపెడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులో జనం హడలిపోతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఐదు పాజిటివ్ కేసులు నమోదవడంతో కరోన అనే పేరు వింటేనే వణికిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 6 కేసులు నమోదు కాగా, అందులో అందులో ఒకరికి నెగటివ్ రాగా ప్రస్తుతం యాక్టివ్ లో ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు చూస్తుంటే మళ్ళీ లక్ డౌన్ తప్పదేమో అనిపిస్తుంది,

Leave a Reply