పైరుకి పురుగు మందుల బదులు లిక్కర్ కొట్టాడు లక్షల్లో ఆదాయం..!

ఆధునిక వ్యవసాయంలో చీడపీడల నివారణలో పురుగు మందులు ఒక అనివార్య భాగమైపోయాయి. అయితే అవి కేవలం చీడపీడల నివారణకే కాక ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణం, మానవాళిపై కలుగజేస్తున్న దుష్ప్రభావాలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. రసాయన పురుగు మందుల వాడకం గత శతాబ్ద కాలంగా పెరుగుతూ వచ్చింది. సస్యరక్షణలో వాడుతున్న మందుల వాటా చూస్తే – పురుగు మందులు 60 శాతం, తెగుళ్ళ మందులు 18 శాతం, కలుపు మందులు 16 శాతం, జీవ కీటకనాశినులు 3 శాతం, ఇతరాలు 3 శాతంగా ఉన్నాయి.

అంటే అత్యధికంగా పురుగుల నివారణలోనే మందుల వాడకం ఎక్కువగా ఉంది. దేశంలో మొత్తంగా వాడుతున్న సస్యరక్షణ మందుల్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ ఈ నాలుగు రాష్ట్రాల్లోనే వాడుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తున్నాయి.అది కాసేపు పక్కన పెడితే మధ్యప్రదేశ్ రైతులు పంటల సాగును పెంచేందుకు వింత పద్ధతులను అవలంబిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నర్మదాపురం రైతులు వేసవి పెసర పంటల ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి దేశీ మద్యాన్ని ఉపయోగిస్తున్నారు.

పంటపై మద్యాన్ని పిచికారీ చేయడం వల్ల రెండు రెట్లు దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు.ఈ సాంకేతికత వల్ల పంట దిగుబడి పరిమాణమే కాకుండా నాణ్యత కూడా పెరుగుతుందని రైతులు నమ్ముతున్నారు. మద్యాన్ని పిచికారీ చేయడం వల్ల పంట కూడా మనుషుల మాదిరిగానే మత్తులోకి వెళ్తుందని రైతులు చెప్పడం అందర్నీ ఆశ్చర్యాన్నికలిగిస్తోంది.

ఈ మద్యం మత్తులోనే పంటలు.. బోర్లు వేయకుండానే రెట్టింపు దిగుబడి ఇస్తున్నాయని రైతులు చెబుతున్నారు. తమ పప్పు ధాన్యాల పంటలకు ఆల్కహాల్ పిచికారీ చేసే విధానం కూడా చాలా సులభమని రైతులు అంటున్నారు. దేశీ మద్యాన్ని తీసుకుని స్ప్రే పంపులో నీళ్లతో కలుపుతున్నారు. ఆ తరువాత, వారు ఈ మిశ్రమాన్ని పంటలపై పిచికారీ చేస్తారు.

ఆల్కహాల్‌ను స్ప్రే చేయడం వల్ల తమ శరీరానికి ఎలాంటి హాని జరగదని, అయితే దాని దుర్వాసన వల్ల మాత్రం తరచుగా అనారోగ్యానికి గురవుతారని వారు చెబుతున్నారు.ముఖ్యంగా పెసర పంటలో ఆల్కహాల్ మిశ్రమాలు వాడటం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని రైతు పంకజ్ పాల్ తెలిపారు. దీంతో పాటు ఖర్చు కూడా చాలా తక్కువ అని, సుమారు 100 ml ఆల్కహాల్ ను 20 లీటర్ల నీటిలో కలిపితే సరిపోతుందంటున్నారు. పంటల సాగుకు మందు కంటే మద్యమే మంచిదని రైతులు నమ్ముతున్నారు.

Leave a Reply