Passed Away | గుండెపోటుతో తెలుగులో విలన్‌ కన్నుమూత..?

allroudadda

Passed Away | ప్రముఖ తమిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ(48) క‌న్నుమూశారు. దీంతో కోలీవుడ్ లో విషాదం నెలకొంది. శుక్ర‌వారం అర్థ‌రాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన డేనియ‌ల్ బాలాజీని కుటుంబ‌స‌భ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.కాగా, డేనియ‌ల్ బాలాజీ త‌మిళంతోపాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌ సినిమాలలో కూడా నటించారు.

ఆయన ఎక్కువ‌గా విల‌న్ రోల్స్‌లోనే నటించారు. తెలుగులో ఐదారు సినిమాలు చేశాడు డేనియల్ బాలాజీ. ఎన్టీఆర్ సాంబ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెంకటేష్ ఘర్షణ మూవీలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించాడు. రామ్‌చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేశాడు.నాని హీరోగా 2021లో రిలీజైన టక్ జగదీష్‌లో మెయిన్ విలన్‌గా డానియల్ బాలాజీ కనిపించాడు. ఇదే అతడి చివరి తెలుగు మూవీ కావడం గమనార్హం.

allroudadda
allroudadda

చేసింది తక్కువ సినిమాలే అయినా విలక్షణ నటనతో దక్షిణాది చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు డేనియల్ బాలాజీ. మలయాళంలో డాడీ కూల్‌, భగవాన్ మోహన్‌లాల్‌, మమ్ముట్టిలకు ధీటుగా విలనిజాన్ని పండించాడు.కాగా చెన్నైలోని పురసామివాకంలో శనివారం డేనియల్ బాలాజీ అంత్యక్రియలను కుటుంబసభ్యులు నిర్వహించబోతున్నారు. డేనియల్ బాలాజీ హఠాన్మరణంతో తమిళ చిత్రసీమలో విషాదం అలుముకుంది. డేనియల్ బాలాజీ మరణం తమను షాకింగ్‌కు గురిచేసిందని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతానం వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Leave a Reply