Andhra Pradesh | భయపెడుతున్న కరోనా.. ఏపీలో తొలి మరణం

allroudadda

Andhra Pradesh | దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 412 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు.

అనారోగ్య కారణాలతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజటివ్ అని తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మృత్యువాత పడ్డాడు. కరోనా కారణంగా తెలంగాణలో ఈ ఏడాది నమోదైన తొలి మరణం ఇదే కావడం గమనార్హం. అలాగే ఏపీలో తొలి మరణం నమోదైంది. ఈనెల 24న KGHలో కరోనాతో జాయిన్ అయిన సోమకళ అనే మహిళ తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

allroudadda
allroudadda

రాష్ట్రంలో ప్రస్తుతం 29 మంది యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో విశాఖ నుంచే 20మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.మరోపక్క ఏపీలో కొత్తగా ఐదుగురు కరోనా బారిన పడ్డారు. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల నుంచి ఈ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా విశాఖలో కేసుల తీవ్రత పెరగడంతో KGHలో వంద ఆక్సిజన్ సిలిండర్లు, 40 వెంటిలేటర్ బెడ్లు సిద్ధం చేశారు అధికారులు.

Leave a Reply