చైతన్య మాస్టర్ మృతి పై తల్లి ఆవేదన..!

ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఏం జరిగిందో కానీ చైతన్య మాస్టర్ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢీ షో లో మాస్టర్ గా చైతన్య ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన డాన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే చైతన్య మాస్టర్ తనకు అప్పులు ఎక్కువ అయ్యాయని…అప్పులు తీర్చలేక ఇతరులను ఇబ్బంది పెడుతున్నానని అన్నాడు. అప్పుల వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వెల్లడించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

చైతన్య మాస్టర్ చాలా మంచివాడు అంటూ ఢీ షో జడ్జిగా వ్యవహరిస్తున్న హీరోయిన్ శ్రద్ధాదాస్ తెలిపింది.ఆయన తన చుట్టూ ఉండే వాళ్ళు అందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అనుకుంటారని పేర్కొంది. ఇదిలా ఉంటే చైతన్య మాస్టర్ మృతిపై అతని తల్లి లక్ష్మీరాజ్యం స్పందించారు. చైతన్య చనిపోయే ముందు 15 నిమిషాల పాటు తనతో ఫోన్ లో మాట్లాడాడు అని చెప్పారు. గుడికి వెళ్లాలన్నాడు డబ్బుల కోసమే చనిపోతున్నానని అనడం నాకు నచ్చలేదని అన్నారు.

అడిగితే నేను ఇవ్వనా…. డప్పుల విషయం ఫ్రెండ్స్ కి కూడా చెప్పలేదని అన్నారు. తనతో పాటు నన్ను కూడా రమ్మంటే నేను పోయేదాన్ని… వాడు చనిపోయాడనే దానికంటే నాకు ద్రోహం చేశాడు అని చైతన్య మాస్టర్ తల్లి బాధపడ్డారు.అయితే ఓసారి ఢీ ఫైనల్ కోసం తనని మూడున్నర లక్ష డబ్బు అడిగారు.ఫైనల్ లో గెలిస్తే నాకు ఏడున్నర లక్షలు డబ్బులు వస్తాయి.నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను అమ్మ అని నాకు చెప్పారు.

ఇదే విషయం వాళ్ళ నాన్నకు చెబితే వాడిని చెడు కొడుతున్నావు అంటూ నన్ను తిట్టారని, అయినప్పటికీ తన నాన్నకు తెలియకుండా రెండుసార్లు ఢీ ఫైనల్ కోసం తనకు ఆరు లక్షల వరకు డబ్బు ఇచ్చానని తెలిపారు.ఇక ఫైనల్లో తన కుమారుడు గెలవలేకపోయారని లక్ష్మి తెలిపారు.ఇలా తన కోసం ఆరు లక్షలు ఇచ్చిన దానిని అప్పులు ఉన్నాయని చెబితే చెల్లించలేమా.

తన కొడుకుకు అప్పులు ఉండే ప్రసక్తే లేదని ఈమె ధీమా వ్యక్తం చేశారు.ఇక ఢీ షో కారణంగా తన కుమారుడికి ఎంత సంపాదన వస్తుంది ఏంటి అనే విషయం తనకు ఏ మాత్రం తెలియదని కానీ ఒక విషయం మాత్రం తాను చెప్పగలనని ఢీ లేకపోతే తన కుమారుడికి ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చేవి కాదు అంటూ చైతన్య తల్లి లక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Leave a Reply