Diamond : రాయలసీమలో అడుగడుగుకి వజ్రాలు..! మొదలైన వజ్రాల వేట..? ఎక్కడ అంటే.

Diamond : శ్రీకృష్ణదేవరాయుల కాలంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు. మరి.. రాయలు ఏలిన రతనాల సీమలో ఇంకా వజ్రాలు దాగున్నాయా? యస్‌.. ఉన్నాయంటున్నారు అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు. రెండు జిల్లాల సరిహద్దుల్లో విలువైన వజ్రాలు దాగున్నాయని చెబుతున్నారు. వర్షం వస్తే ఇక్కడి నేలలపై పంటలు పండుతాయో లేదోగానీ.. వజ్రాలు మాత్రం పండుతాయని నమ్మకం.

అందుకే వాన పడినప్పుడల్లా ఇక్కడి ప్రజలు వజ్రాన్వేషణలో ఉంటారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో Kurnool కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది.తాజాగా కూడా ఓ రైతుకు 20 లక్షల రూపాయల విలువైన వజ్రం దొరికిందని చెబుతున్నారు.

ఇంతకీ సీమలో వజ్రాలు ఎక్కడున్నాయి? వాటిని గుర్తించడం ఎలా?..

వర్షాకాలంలో ఎక్కడైనా రైతులు పొలంబాటపడతారు.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై పైసో పరకో సంపాదించుకోవాలని చూస్తారు.

పంటలు బాగా పండి బతుకు బండి సాఫీగా సాగిపోవాలని దేవుడిని ప్రార్థిస్తుంటారు. కానీ, రాయలసీమలో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితులు. తొలకిరి ఎప్పుడొస్తుందా.. తమ అదృష్టం ఎప్పుడు మారుతుందా? అని చూస్తుంటారు సీమ రైతులు… ఒక్కసీమ రైతులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదృష్టంపై నమ్మకంతో అనేక మంది సీమలో పొలంబాట పడుతుంటారు. కరువు నేలగా చెప్పే రాయలసీమలో రైతులు..

ఇతర ప్రాంతాల వారు ఎందుకంత ఆసక్తిగా ఎదురుచూస్తారని ఎవరికైనా అనుమానం రావొచ్చు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబూనగర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోని పొలాల్లో వర్షాకాలంలో వజ్రాల వేట సాగుతుంటుంది. అదృష్టవంతులకు కోట్ల రూపాయల విలువైన వజ్రాలు దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Leave a Reply