Tamanna: తొలిసారి ప్రియుడి కోసం అలాంటి పని చేసిన తమన్నా.!

మిల్కీ బ్యూటీ తమన్నాప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.బాలీవుడ్‌ నటుడు విజయ​ వర్మతో ప్రేమ వ్యవహారం నిజమేనని తను ఎప్పుడైతే ఒప్పుకుందో ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. విజయ్‌ వర్మ విషయంలో తన నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నా మరికొందరు తనకు సపోర్టుగా నిలుస్తాన్నారు. దీంతో తమన్నాకు ఎక్కడికెళ్లిన అభిమానుల తాకిడి ఎక్కువైంది.

గతవారం ఇంటర్నెట్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ లో వీళ్ళిద్దరి బోld సీన్స్ మరియు రొమాన్స్ బయటపడింది. అయితే వీరిద్దరి ప్రేమ కూడా ఆ వెబ్ సిరీస్ వల్లనే పుట్టినట్టు అర్థం అవుతుంది. అసలు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు కూడా ఒక కిస్సింగ్ సీన్ కు ఒప్పుకొని తమన్నా, ఈ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మతో ఆ రూల్ నువ్వు బ్రేక్ చేసి లిప్ కిస్ పెట్టింది.

ఇది ఆమెకు అంత ఈజీ కాదని కూడా ఆమె తెలియజేసింది. కానీ విజయవర్మ కోసం ఆ సీన్ చేసి ఆ రూల్ బ్రేక్ చేసిందంటే వాళ్ళిద్దరి మధ్యన తప్పకుండా ఏదో నడుస్తోందని ఫాన్స్ అనుకుంటున్న సమయంలో, ప్రమోషన్లలో తనకు విజయ్ అంటే చాలా ఇష్టం అని తెలియజేసింది తమన్నా. అయితే షూటింగ్ జరిపే సమయంలో విజయ్ వర్మ కు ఆ విషయాన్ని తెలియజేసిందట.

ఇప్పటివరకు తాను ఎవరిని ముద్దు పెట్టుకోలేదని, ఆ రూల్ ను తనతో బ్రేక్ చేస్తోందని చెప్పిన తర్వాత ఆనందాన్ని తట్టుకోలేని విజయ్, ఆమెకు థాంక్స్ చెప్పాడట. తమన్నా లాంటి ఒక అందమైన కో యాక్టర్ తన కోసం ఆ రూల్ బ్రేక్ చేసిందని తెలిసిన తర్వాత ఏ హీరో అయినా ఎగిరి గంతులు వేస్తాడు. తన లోపల టపాసులు పేలుతున్న కూడా, ఎంతో సైలెంట్ గా ఉంటూ తమన్నాకు థాంక్స్ మాత్రమే చెప్పాడట విజయ్.

Leave a Reply