Dil Raju | తప్పుడు రాతలు రాస్తే అందరికీ తాటతీస్తా..దిల్ రాజు వార్నింగ్

allroudadda.

Dil Raju | టాలీవుడ్‌లో సినిమాలకు అతిపెద్ద సీజన్ సంక్రాంతి. అందుకే ఈ పండుగకు సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు అగ్ర హీరోలు నటించిన సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్‌కు పోటీప‌డుతుంటాయి. ఈసారి కూడా సంక్రాంతికి ఐదు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమ‌య్యాయి. థియేటర్ల కొరత కారణంగా రవితేజ హీరోగా నటించిన ఈగల్ విడుదల వాయిదా పడింది.

మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ బరిలో నిలిచాయి. అయితే సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల్లో కొన్ని సినిమాలకే థియేటర్లు దొరుకుతున్నాయని.. మిగిలిన వాటికి దొరకడంలేదనే ప్రచారం మొదలైంది.నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గుంటూరు కారం సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారని విమర్శలు వచ్చాయి. హనుమాన్ సినిమాను వాయిదా వేసుకోవాలని దిల్ రాజు చెప్పినట్టు ప్రచారంలోకి వచ్చింది.

భర్తను పేరు పెట్టి పిలిస్తే ఏమౌతుందో తెలుసా?

allroudadda.
allroudadda.

Dil Raju | దిల్ రాజు మెతక అనుకుంటున్నారా..

Dil Raju | హనుమాన్ సినిమాకు థియేటర్లు దక్కకుండా చేశారని, ఆ సినిమాకు అన్యాయం జరుగుతోందని వార్తలు వచ్చాయి. దీనిపై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయని, ఏదో ఒకరకంగా నన్ను వివాదాల్లోకి లాగుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మీ వెబ్ సైట్లకు వ్యూస్ వచ్చేందుకు నా పేరును వాడుకుంటే సహించేదిలేదు… తాట తీస్తా! నా గురించి తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్లకు ఇదే నా హెచ్చరిక” అని దిల్ రాజు స్పష్టం చేశారు.

ఎప్పటికీ భార్య‌లు భ‌ర్త‌ల‌కు అస్స‌లు చెప్ప‌కూడ‌ని విష‌యాలు ఇవేన‌ట‌

“నిన్న హను-మాన్ ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ చక్కగా చెప్పారు. దిల్ రాజు Dil Raju ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి… ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో ఆయనకు తెలుసు అని మంచిగా చెప్పారు. కానీ చిరంజీవి గారి వ్యాఖ్యలను కొన్ని వెబ్ సైట్లు వక్రీకరించాయి. మరో అర్ధం వచ్చేలా ఆ వెబ్ సైట్లలో రాశారు.మీ వెబ్ సైట్ ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ఇతరుల గురించి తప్పుడు వార్తలు రాస్తారా? ఇతరులను ఎందుకు వాడుకుంటున్నారు? మీకిది అవసరమా? దిల్ రాజు మెతక అనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. ఎందుకులే… సాఫ్ట్ గా వెళదాం అని అనుకునేవాడ్ని. కానీ ఈ రాతలు చూశాక ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదిలేదు.

Leave a Reply