శాకుంతలం సినిమాపై దిల్ రాజు వైరల్ కామెంట్స్…!

సమంత…దిల్ రాజు..గుణశేఖర్. పెద్ద పెద్ద పేర్లు కానీ శాకుంతలం తొలి రోజు వసూళ్లు చూస్తే బేజారే. సినిమా విడుదల తరువాత సంగతి సరే. ముందు ఓపెనింగ్ ఎందుకు లేదు? లేడీ సూపర్ స్టార్ అంటారు కదా సమంత. అది నమ్మే కదా దిల్ రాజు-గుణశేఖర్ 70 కోట్లు పెట్టుబడి పెట్టారు. కానీ రెండు విధాల షాక్ తగిలింది. సినిమా మాకొద్దు అంటే మాకొద్దు అని బయ్యర్లు అనడం తొలి షాక్. ఆఖరిక అడ్వాన్స్ ల మీద విడుదల చేసుకోవాల్సి వచ్చింది. సినిమాకు సరైన ఓపెనింగ్ పడలేదు.

అది రెండో షాక్.ఉత్తరాంధ్రలో పట్టుమని 14 లక్షలు షేర్ రాలేకపోయింది. దీనికన్నా యశోద నే బెటర్ 16 లక్షలు రాబట్టింది. లారెన్స్ సినిమా రుద్రుడు ఉత్తరాంధ్రలో పది లక్షలు షేర్ రాబట్టింది. నైజాంలో డెభై నుంచి ఎనభై లక్షల వరకు వచ్చిందని తెలుస్తోంది. యశోద సినిమా 65 లక్షల వరకు రాబట్టింది.కాగా ఈ సినిమా కలక్షన్ ల గురించి దిల్ రాజు మాట్లాడుతూ సమంత సినిమా తనకి పెద్ద ఝలక్ ఇచ్చిందంటూ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సమంత నటించిన మైథిలాజికల్ మూవీ శాకుంతలం ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమాని గుణశేఖర్ నిర్మించగా దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరించాడు. మూవీ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తానే తీసుకోని రిలీజ్ చేశాడు. మూవీ రిజల్ట్ తేడా కొట్టడంతో భారీగా నష్టపోయినట్లు చెప్పుకొచ్చాడు.

తన 25 ఏళ్ల కెరీర్‌లో శాకుంతలం ఒక పెద్ద షాక్ ఇచ్చింది అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.కాగా దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం దిల్ రాజు సంస్థలో 50వ సినిమాగా వస్తుంది. దీంతో ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోని నిర్మిస్తున్నాడు. దాదాపు 170 కోట్ల బడ్జెట్ తో గేమ్ చెంజర్ ని తెరకెక్కిస్తున్నాడు.

Leave a Reply