Venu Swamy | వేణుస్వామితో పూజలు చేయించిన డింపుల్‌ హయతి.. డైరెక్ట్ గా మందు బాటిల్..

allroudadda

Venu Swamy | వేణు స్వామి సోషల్ మీడియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఎన్నో సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద కామెంట్లతో అందరినీ ఆకర్షించారు. అయితే ఆయనతో పూజలు చేయించుకుని దోషాలు నివారించుకోవాలని కూడా పలువురు ముందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మన టాలీవుడ్ లో కూడా ఎంతో మంది ప్రముఖులకు ఆయన పూజలు చేశారు.తాజాగా హీరోయిన్ డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి కూడా ఈ లిస్ట్ లో చేరిపోయింది.

అయితే మొదటి నుంచి ఆమెతో వేణుస్వామి పూజలు చేయిస్తునే వస్తున్నాడు .. కానీ, ఈసారి పూజలో వైన్ బాటిల్స్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఏం పూజ రా ఇది..వైన్ బాటిల్స్ పెట్టారు అంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు.ఇక ఇలా లిక్కర్ తో పూజ జరిపించడంపై వేణుస్వామి ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. ఇదో రకం పూజ అని, ఇందులో తీర్థం మంచి నీళ్లతో ఉండదని, అందులో లిక్కర్ కలిపే ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఏ లిక్కర్ తాగితే.. దాన్నే పూజలో పెడతాను అని, లిక్కర్ తాగకపోతే, కూల్ డ్రింక్ పెడతాను అని చెప్పాడు.

allroudadda
allroudadda

” నా దగ్గరకు ఎవరైతే పూజలు కోసం వస్తారో.. ఇప్పుడు ఉదాహరణకు మీరు పూజ చేస్తే నీళ్లు తీర్థం పోసి ఇస్తారు కదా.. నేను చేసే పూజలో వాటర్ లో లిక్కర్ కలిపి ఇస్తా. ప్రతి పూజలో లిక్కర్ ఉంటుంది. నేను చేసే వామచార పూజలు..బాగాలమ్మకు,రాజ శ్యామల, తార, చిన్నమస్త.. ప్రతి పూజకు నేను లిక్కర్ పెడతా.. నాన్ వెజ్ పెడతా. నేను ఇచ్చే ప్రసాదం కూడా లిక్కరే ఇస్తా. డైరెక్ట్ అఫిషియల్ గా పెడతా.. నేనేం దొంగచాటుగా పెట్టను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలు విన్న తరువాత డింపుల్ వైన్ తాగుతుంది కాబట్టి వైన్ బాటిల్స్ తో పూజ చేయించాడు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply