Sunday

Sunday | తస్మాత్ జాగ్రత్త.. ఆదివారం ఈ పనులు అసలు చేయకండి..చేస్తే మాత్రం..

Sunday | హిందూ మతంలో ఆదివారం చాలా ముఖ్యమైన రోజు. ఆదివారాన్ని సూర్యదేవుని రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు చాలా మంది భక్తులు ఆదివారం ఉపవాసం ఉంటారు. సూర్యభగవానుని అనుగ్రహాన్ని పొందేందుకు ఆదివారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజు చాలా ముఖ్యమైనది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆదివారాలుచేయాల్సిన పనులు ఏంటి..? చేయకూడని పనులు ఏంటి? అనే విషయానికి వస్తే.. సమస్త ప్రాణి కోటికి ఆధార భూతమైనవాడు సూర్య భగవానుడు.

సూర్యడు అధిపతిగా ఉన్న రోజే ఆదివారం. ఇక సూర్యాష్టకం అనేది ఉంది. రెండు శ్లోకాలు అందులో తెలపబడ్డాయి. అందులో ఫస్ట్ ది అమిషా మధుపానం జన్మజన్మ దరిద్రతా.. అంటే ఆదివారం రోజు మాంసం తిన్నా, మద్యం సేవించినా ఏడు జన్మల వరకు రోగస్తులు అవుతారు. జన్మజన్మలకు దరిద్రాన్ని అనుభవిస్తారు. అందుకోసం ఆదివారం నాడు మద్యం సేవించడం, మాంసహారం తినడం వంటివి అస్సలు చేయకూడదు.

Sunday
Sunday

నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం

ఆదివారం మద్యం, మాంసం స్వీకరించడం, తలకు ఆయిల్ రాసుకొని స్నానం చేయడం వంటి పనులు చేయని వారికి శ్లోకం అనేది ఉండదు. వ్యాధులు అనేవి రావు. అసలు దరిద్రం అనేది ఉండదు. ప్రధానంగా ఆదివారం రోజు ఉన్నత పదవులు చేపట్టడం ఉద్యోగరిత్యా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి పైఅధికారులకి చెప్పడం ప్రభుత్వ కార్యకలాపాలు, బంగారం కొనుగోలు చేయడం, కోర్టు సమస్యలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, కుటుంబపరమైన సమస్యలు,

Also Read :  భర్తతో విడాకులకు రెడీ అయిన మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య..

Sunday
Sunday

వ్యాపార సామాగ్రిని కొనుగోలు చేయడం, వ్యవసాయ సామాగ్రిని కొనడం వంటి పనులు చేపట్టడం వల్ల అన్ని పనుల్ని విజయవంతంగా చేయగలుగుతారు. అదేవిధంగా ఆదివారంరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం, వివాహ, శుభకార్యాలు వంటివి జరుపుకోవడం, పడమటి దిక్కున ప్రయాణాలు చేయడం వంటి పనులని ప్రారంభించకుండా ఉంటే చాలా శ్రేయస్కరం. ఉద్యోగ, వ్యాపార కుటుంబ సమస్యల నుంచి వాటికి పరిష్కారం కావాలి అంటే.. ఆదివారం రోజు రామాయణం చదవడం పరిష్కారం పొందుతారు.

Leave a Reply