నటుడు ప్రసాద్ బాబు కొడుకు-కోడలు కూడా హీరో హీరోయిన్లు అని మీకు తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో కాలంగా మనల్ని అలరిస్తున్న నటులలో ప్రసాద్ బాబు ఒకరు. పునాదిరాళ్లు, బొబ్బిలి పులి, రుద్రవీణ, యముడికి మొగుడు, అల్లరి మొగుడు, ఘటోత్కచుడు, పాండురంగడు, మురారి, నేటి గాంధీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలా ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు ప్రసాద్ బాబు.మురారి సినిమాలో మహేష్ బాబు కి పెద్దన్నయ్య పాత్రలో నటించారు.

తెలుగులోనే కాకుండా కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు ప్రసాద్ బాబు. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా, జయం, చిన్న కోడలు, రాములమ్మ, బంధం, ప్రేమ్ నగర్ సీరియల్స్ లో కూడా నటించారు.ప్రసాద్ బాబు కొడుకు కూడా ప్రముఖ నటుడే. ఆయన పేరు శ్రీకర్. శ్రీకర్ ఎన్నో తమిళ సీరియల్స్ నటించారు.

శ్రీకర్ భార్య కూడా మనందరికీ తెలుసు. తనే సంతోషి. సంతోషి, తేజ దర్శకత్వం వహించిన జై సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా లో కూడా ఒక ప్రధాన పాత్రలో నటించారు. తర్వాత ఢీ సినిమాలో కూడా నటించిన సంతోషి, తర్వాత తెలుగుతో పాటు ఎన్నో తమిళ్ సీరియల్స్ లో చేశారు. సంతోషి, శ్రీకర్ కలిసి తమిళ్ లో ఒక సీరియల్ లో నటించారు.

Leave a Reply