allroudadda

Mahabharat | పాపం ద్రౌపది తన ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసేదో తెలుసా..?

Mahabharat | హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం అనేది శిక్షార్హమైన నేరం. కానీ హిందూ మతం గ్రంధాలను తిరగేస్తే, పూర్వం ఇలా ఉండేది కాదని అవగతమవుతుంది. అయితే హిందూ స్త్రీలు మాత్రం, ఒకరి కంటే ఎక్కువమందిని వివాహం చేసుకునేందుకు అనుమతి లేదు. అప్పుడూ, ఇప్పుడూ కూడా స్త్రీల విషయంలో మాత్రం, బహుభర్తృత్వం ఒక పాపంగా పరిగణిస్తారు. పవిత్రత అనేది స్త్రీల వ్యక్తిత్వానికే అతి ముఖ్యమైన ఆభరణమని, ఆమె తన భర్త యెడల విశ్వసనీయతతో మెలగాలని ఆమెకు ఉగ్గుపాలతో నేర్పిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా, మహాభారత కాలంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నట్లు చెప్తారు. ఇలా ఎందుకు జరిగిందో, దీని వెనుక ఉన్న కారణాలేమిటో తెలుసుకుందాం!

ద్రౌపదికి పాంచాల రాజైన ద్రుపదుని కుమార్తె. ఆమె ఒక యజ్ఞఫలంగా జన్మించింది. ద్రుపదమహారాజు, ద్రోణాచార్యుని చేతిలో కలిగిన ఓటమికి ప్రతీకారంగా, తన చేతులతో ద్రోణుడిని ఓడించాలని నిశ్చయించుకుంటాడు. ఆ లక్ష్యంతోనే తన ఇంట ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. ఆ యజ్ఞ జ్వాల నుండి ముందుగా దృష్టద్యుమనుడనే ఒక శక్తిమంతమైన బాలుడు ఉద్భవించాడు.అటు పిమ్మట కృష్ణ అను పేరు కల బాలిక ఆవిర్భవించింది.

allroudadda
allroudadda

ఆమెలో కాళికా దేవి యొక్క అంశ ఉందని నమ్మేవారు.తరువాతి కాలంలో ఆమె ద్రుపదమహారాజు కుమార్తెగా ద్రౌపది అనే పేరు సంతరించుకుంది. ఆమె విష్ణుమూర్తి యొక్క అవతారమైన కృష్ణునికి పరమ భక్తురాలు. కృష్ణుడు మరియు ద్రౌపదిని మహాభారతంలో అన్నాచెల్లెళ్లగా చిత్రీకరించారు. ద్రౌపదిని “వస్త్రాపహరణ” సమయంలో మానసంరక్షణ ద్వారా శ్రీ కృష్ణుడు కాపాడాడని చెప్తారు. కౌరవులు మరియు పాండవుల మధ్య వైరానికి ఇది ఒక ముఖ్య కారణం.అర్జునుడు ఒక స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకుంటాడు.

allroudadda
allroudadda

ఆ తర్వాత ఆమెను అర్జునుడు(arjunudu) తన తల్లి అయిన కుంతీదేవి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ నేనేం తీసుకొచ్చానో చూడు అనగానే ఆమె పరధ్యానంలో ఉండడం వల్ల నువ్వు ఏది తెచ్చిన అందరు సమానంగా పంచుకోవాలని నాయన అని ఆజ్ఞాపిస్తుంది. తల్లి మాట జవదాటని పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెళ్లాడతారు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన కుంతి ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడుతుంది.

allroudadda
allroudadda

ఏది ఏమైనా కానీ ద్రౌపది(draupadi) మాత్రం తన భర్తలతో చాలా సఖ్యతగా ఉండేదని చరిత్ర చెబుతోంది. అయితే ద్రౌపది ఐదుగురి వద్ద ఉండేది. ఒక్కొక్కరి వద్ద కొన్ని నెలల పాటు గడిపేది. ఆమె ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు, మరొకరు ఆమె ఉన్నచోటికి అస్సలు వెళ్ళకూడదు. అలా వెళ్తే నియమం తప్పడమే అవుతుందని, ఆ నియమం తప్పితే అరణ్యవాసానికి వెళ్లాలని ఒక షరతు పెట్టిందట. దాని ప్రకారమే ఐదుగురు ద్రౌపతి ఎవరి దగ్గర ఉన్న, మిగతా నలుగురు అక్కడికి వెళ్లేవారు కాదట ఆ విధంగా నియమాలతో వారితో హ్యాపీగా గడిపేదట ద్రౌపది.

Leave a Reply