Money  | మీకు ఆకస్మికంగా కలలో డబ్బులు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా?

allroudadda

Money  | పడుకున్నప్పుడు కొందరికి డబ్బులు సంపాదించినట్టు కలలు వస్తుంటాయి. మరికొందరికి లాటరీ వచ్చినట్టు.. ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చినట్టుగా కలలు వస్తుంటాయి. కొందరు వీటిని తలచుకుని తమకు వచ్చిన కల నిజమైతే బాగుండు అని ఆశపడుతుంటారు. మరికొందరికి అయతే తమ నుంచి డబ్బులు కొట్టేస్తున్నట్టు కూడా కలలు వస్తుంటాయి. మరి ఇలా పదే పదే కలలో డబ్బులు కనబడితే దాని అర్థమేంటి? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

లాటరీలో డబ్బులు గెలుచుకున్నట్టుగా కలలు వస్తే అదృష్టాన్ని సూచిస్తుంది. తొందరలోనే కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారని లేదా జీవితంలో విజయం సాధించబోతున్నారని చెప్పడానికి ఇది సంకేతమని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇటువంటి కలలు వచ్చినప్పుడు మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. కలలో వచ్చినట్టుగా నిజంగానే డబ్బులు రాకపోయినా గానీ మంచి జరుగుతుందనే నమ్మకాన్ని మాత్రం కలిగిస్తుంది.

www.allroudadda.com
www.allroudadda.com

అదే బంగారం బహుమతిగా తీసుకుంటున్నట్టు కలలు వస్తే అది శుభ సూచికం. తొందరలోనే ఆర్థికంగా స్థిరపడుతారని అర్థం.కలలో దొంగిలించినట్టు కల వస్తే ఇది ప్రమాదాన్ని సూచిస్తుంది. చేసే పనిమీద జాగ్రత్త పెట్టడం మంచిది. అదే ఎవరికైనా డబ్బులు ఇస్తున్నట్టు కలలో వచ్చినా సరే మీరు ప్రమాదంలో పడబోతున్నట్టు అర్థం. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదంలో పడబోతున్నారని.. లేదా అసౌకర్య పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పడాన్ని ఇది సూచిస్తుంది.

Fackt | వాహనాలకి , గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారో తెలుసా.

కలలో మీ డబ్బు కోల్పోయినట్టు కల వస్తే కష్టాలు ఎదుర్కొబోతున్నట్టు అర్థమని తెలుస్తోంది. డబ్బులు లెక్కబెడుతున్నట్టు కలలు రావడం కూడా మంచిది. అలా వస్తే ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కలలో కేవలం డబ్బు మాత్రమే కనిపిస్తే మీరు డబ్బును ఆదా చేయడం లేదని సంకేతం. అలాగే కోరుకున్న జీవితానికి పూర్తి విరుద్ధంగా జీవిస్తున్నారని గుర్తు చేయడానికి ఇలాంటి కలలు వస్తాయట. అలాంటప్పుడు జాగ్రత్త పడి భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాలి.

Leave a Reply