రోజూ బీర్ తాగుతున్నారా? అయితే ఇది తప్పక తెల్సుకోండి..!

ఆల్కహాల్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటున్నది. ముఖ్యంగా బీర్. ప్రతి రోజు రాష్ట్రంలో ఎన్ని బీరులు అమ్ముడు పోతున్నాయో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ప్రభుత్వానికి వస్తున్న నికర ఆదాయంలో ఎక్కువ భాగం ఆల్కహాల్ విక్రయం వలనే వస్తుంది. ఇది సత్యం అందుకే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఆల్కహాల్ ను నిషేదించరు.ఎండాకాలం వస్తే బీర్ అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి.

చెప్పాలంటే ఒక్క ఎండాకాలంలోనే కాదు.. ఏ కాలంలో అయినా సరే బీర్ అమ్మకాలు భారీగానే ఉంటాయి. బీర్ ఎందుకు తాగుతున్నారు అంటే చాలామంది చెప్పే విషయం బాడీ కూలింగ్ కావడం కోసం అని చెప్తుంటారు. ఇందులో ఎంత సత్యం ఉన్నది.

బీర్ తాగితే నిజంగానే బాడీ కూల్ అవుతుందా అంటే అది నిజం కాదని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎక్సర్ సైజ్ లు చేసిన తరువాత చాలామంది బాడీలో వాటర్ కంటెంట్ కోసం బీర్ తీసుకుంటూ ఉంటారు. బీర్ కు బదులు మామూలు నీళ్లు తీసుకున్నా సరిపోతుందట.

బీర్ కంటే నీరే ఎక్కువ చల్లదనం ఇస్తాయి. అంతేకాదు, శరీరం నుంచి చెమట రూపంలో వెళ్ళిపోయిన నీటిని తిరిగి రికవరీ అవుతుంది. ఆల్కహాల్ కంటెంట్ లేని బీర్ తీసుకోవడం మంచిదేగాని, ఎండాకాలంలో కూడా కూలింగ్ కోసం ఎక్కువ బీర్ తీసుకున్నా ఉపయోగం లేదని పరిశోధనలో తేలింది. పైగా బీర్ ఎక్కువగా తీసుకుంటే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో మరికొంత నీటిని కోల్పోయే పరిస్థితి వస్తుంది.

Leave a Reply