Eesha Rebba: పెళ్లి కాలేదు కానీ ఇద్దరు పిల్లలున్నారు.. ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్.

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ గా పేరుపొందింది బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba). 2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంతో.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయమైంది. ఆ తరువాత హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసింది ఇషా రెబ్బా. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ఈషా రెబ్బా ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా పరిచయమైంది.

హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది ఈ బ్యూటీ.’బందిపోటు’, ‘అమీ తుమీ’, ‘మాయా మాల్’, ‘దర్శకుడు’, ‘సుబ్రహ్మణ్యపురం’, ‘బ్రాండ్ బాబు’, ‘అ!’, ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘రాగల 24 గంటల్లో’ వంటి సినిమాల్లో నటించింది. అయితే, అందంతో పాటు అభినయం కలబోసిన ఈషా రెబ్బాకు (Eesha Rebba) ఆశించిన స్థాయిలో క్రేజీ ఆఫర్స్ మాత్రం రాలేదనే చెప్పాలి.

ఇటీవలే మాయా బజార్‌ ఫర్‌ సేల్‌ అనే సిరీస్‌లో యాక్ట్‌ చేసింది. ఈ వెబ్‌ సిరీస్‌ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ షోలో పాల్గొన్న ఈషా.. తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది? అన్న ప్రశ్నకు తొందరపడ్డప్పుడు అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత యాంకర్‌.. నీ ప్రేమకథ గురించి చెప్పు అని అడగ్గా.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వెల్లడించింది.ఆమె మాటతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

ఈషా తనకు పిల్లలున్నారని చెప్పడంతో ప్రోమో పూర్తయింది. దీంతో అసలు నిజమేంటనేది తెలియరాలేదు. తను ఎవరినైనా దత్తత తీసుకుందా? లేదా తన బంధువుల సంతానాన్ని తన పిల్లలుగా పెంచుకుంటుందా? మరెవరినైనా చదివించే బాధ్యతను తన భుజాన వేసుకుని వారిని కన్నబిడ్డలుగా చూసుకుంటుందా? అదీ కాదంటే తన పెంపుడు కుక్కపిల్లల గురించి మాట్లాడిందా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Leave a Reply