కూల్ డ్రింక్ త్రాగిన వెంటనే మీ శరీరంలో ఏమి జరుగుతుందో తెలిస్తే షాక్..

వేసవి వచ్చిందంటే చాలు.. జనాలు కూల్‌డ్రింక్స్‌ తాగేందుకు ఎగబడుతారు. ఓ పూట అన్నమైన తినకుండా ఉంటారు కానీ..కూల్‌డ్రింక్స్‌ను మాత్రం తాగడం మిస్సవవ్వారు. వేసవి ఒక్కటే కాదు. ప్రతి కాలంలో కూల్‌డ్రింక్స్‌ ఎడాపెడ తాగుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రతి శుభకార్యాల్లోనూ కూల్‌డ్రింక్స్‌ పెట్టడం మామూలైపోయింది. కొందరైతే భోజనం చేసిన తర్వాత కూల్‌డ్రింక్స్‌నే తాగుతున్నారు. మార్కెట్లలో వివిధ రకాల కూల్‌డ్రింక్స్‌ అందుబాటులోకి రావడంతో చిన్నా పెద్ద తేడా లేకుండా గొంతులోకి వేసుకుంటున్నారు.

వేసవి తాపానికి తట్టుకోలేక కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నప్పుడు అది గొంతులో దిగేటప్పుడు ఆ మజానే వేరు. ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులతో ఇబ్బందులకు గురవుతుంటారు.పూర్వకాలంలో దాహాన్ని తీర్చుకునేందుకు స్వచ్ఛమైన మంచినీరు తాగేవారు. ఆ నీటిలో ఎలాంటి కలుషితం లేకపోవడంతో ఆరోగ్యంగా ధృడంగా ఉండేవారు.ప్రస్తుతం నాణ్యత లోపించిన ఆహారం, కలుషితమవుతున్న నీరు, వివిధ రసాయనాలు కలిపి తయారు చేస్తున్న కూల్‌డ్రింక్స్‌ తాగుతూ తమ తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు.

ఇటీవల గట్‌ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగేవారు వివిధ రోగాలకు గురవుతున్నట్లు స్పష్టమైంది. ఎక్కువ కూల్‌డ్రింక్స్‌ తాగేవారు ఆమ ఆయుష్యును కూడా తక్కువ చేసుకుంటున్నారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అధికంగా కూల్‌డ్రింక్స్‌ తీసుకుంటున్న వారిలో పెద్దప్రేగు క్యాన్సర్‌ సమస్యతో బాధపడుతున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. అలాంటి సమయంలో కూల్‌డ్రింక్స్‌ రోజులో ఒక్కసారి కన్నా ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పొంచిఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సాధారణ స్థితిలో కూల్‌డ్రింక్స్‌ తీసుకోవడంతో ఎలాంటి ఇతర రోగాలు దరిచేరవంటున్నారు.కూల్‌డ్రింక్స్‌ తయారీలో కృతిమ చక్కెర, ప్రిజర్వేటివ్, తదితర రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని వాడటంతో ఉబకాయ సమస్యతో పాటు యుక్త వయస్సులోనే మధుమేహం, థైరాయిడ్, బీపీ, హర్మోన్ల సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పానీయాలు తాగితే కాలేయానికి కూడా ప్రమాదమే. కాలేయం దానిలో ఉన్న చక్కెరను జీర్ణం చేయడానికి చాలా కష్టపడాలి. దీని మూలంగా కాలేయంలో వాపు వస్తోంది.

Leave a Reply