పాపం హెల్మెట్‌​ను చాక్లెట్‌ అనుకోని మింగేసిన ఏనుగు..! వీడియో వైరల్

దారిలో ఆగి ఉన్న ఓ బైక్ కనిపించింది, ఆ బైక్ మీద ఓ హెల్మెట్ కూడా ఉంది. ఆ హెల్మెట్ ఏనుగు కంట్లో పడింది. ఆ ఏనుగు అదిఏదో తినే పదార్ధం అన్నట్లుంది.. వెంటనే ఆ హెల్మెట్ ను తన తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుని గుటుక్కు మనిపించడానికి ప్రయత్నిస్తుంది.

ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.వివరాలు.. ఈ సంఘటన గువహతిలోని సత్​గావ్​ ఆర్మీ క్యాంపులో చోటుచేసుకుంది. ఈ ఆర్మీ క్యాంపు అడవికి సమీపంలో ఉంది. అయితే, ఏలా వచ్చిందో.. కానీ, ఒక గజరాజు అడవి నుంచి ఆర్మీ క్యాంపు వైపు వచ్చింది. అది పార్కింగ్​ చేసి ఉన్న బైక్​ దగ్గరకు చేరుకుంది. అక్కడ, బైక్​కు తగిలించి ఉన్న హెల్మేట్​ను తోండంతో తీసుకుంది. దాన్ని పట్టుకుని వింతగా చూసింది.

ఇదంతా గమనిస్తున్న కొంత మంది అధికారులు ఏనుగు దాన్ని కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ ఆ ఏనుగు మాత్రం.. తోండంతో ఆ హెల్మేట్ ను​ అమాంతం నోట్లో వేసుకొని గుటుక్కున తినేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. అయితే , దీన్ని చూసిన నెటిజన్లు.. ‘పాపం… గజరాజుకి ఏంత ఆకలేసిందో..’, ‘ బహుషా.. వెలగ పండు అనుకొని ఉంటుంది కాబోలు..’, ‘ హెల్మెట్​ లేదు.. ఇక ఎలా బయటకు ఎలా వెళ్తావు’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

.