ఎమ్మెల్యేపై కామెడీ చేసిన ఇమాన్యుల్ చుక్కలు చూపించిన కార్యకర్తలు,

జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో ఇమాన్యుల్ కూడా ఒకరు. మొదట ఇమాన్యుల్ కి సరైన గుర్తింపు లభించలేదు. కానీ వర్ష తో జంటగా స్కిట్లూ చేయటంతో వీరిద్దరూ జంటగా బాగా ఫేమస్ అయ్యారు. అందులో భాగంగానే వీరి మధ్య హగ్గులు, కిస్సులు కూడా ఉంటాయి. ఫ్యూచర్లో వీరిద్దరు కలిసి జీవిస్తారని అనుకుంటున్నారు.

అయితే ఇమ్మాన్యుయేల్ కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర స్పషల్ ఈవెంట్లలోనూ సందడి చేస్తున్నాడు. మిగతా యాంకర్లకు పోటీగా ఆయన కామెడీ ఆకట్టుకోవడంతో పలు షో లనుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి.తాజాగా ఈ యంగ్ కమెడియన్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుకరిస్తూ ఓ కామెడీ చేశాడు. ఓ గెటప్ వేసుకుని ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఇమ్మాన్యుయేల్ చేశాడు.

ఇమ్మాన్యుయేల్ ఎమ్మెల్యేగా మారి స్కూల్ పిల్లాడిగా బాబును పెట్టాడు. దీంతో ఇమ్మాన్యుయేల్ బాబును కర్రతో అచ్చం ఎమ్మెల్యేలాగే కొట్టడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. అయితే చివరగా కమెడియన్లంతా చేరి ఇమ్మాన్యుయేల్ ను చితక్కొట్టారు. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది.ఈ వీడియోపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గం గుర్రుతో ఉంది. ఎమ్మెల్యే ప్రజా కార్యక్రమాలు చేపడితే మీకు కామెడీగా ఉందా? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.ఏర్

Leave a Reply