అందం కోసం 9 వేల ఖరీదైన ఇంజెక్షన్లు వాడిన రామ్‌చరణ్ హీరోయిన్..!

బాలీవుడ్‌లో జన్నత్ 2 సినిమాతో 2012లో ఎంట్రీ ఇచ్చిన ఈషా గుప్తా..షాకింగ్ నిజాలు వెల్లడించింది. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాల్ని వివరించింది. ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో ఏం జరిగిందో వెల్లడించింది. తెల్లగా కన్పించేందుకు, రంగు కోసం అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లు తీసుకోమని సూచించారంటూ షాకింగ్ నిజాలు తెలిపింది. కెరీర్ ప్రారంభంలో తన స్కిన్ రంగు విషయమై ఎదురయ్యే ప్రశ్నలు, ఇబ్బందుల్ని గుర్తు చేసుకుంది.

కెరీర్ ప్రారంభంలో నా ముక్కును షార్ప్‌గా చేసుకోమని సూచించేవారు. నా ముక్కు గుండ్రంగా ఉందని అనేవారు. అంతకంటే ముందు స్కిన్ ఫెయిర్ కోసం ఖరీదైన ఇంజెక్షన్లు తీసుకోమని ఒత్తిడి తెచ్చేవారని తెలిపింది. ఆ ఇంజెక్షన్ ఒక్కొక్కటి 9 వేల రూపాయలని, ఆ ఇంజెక్షన్ పేరు చెప్పనని..కానీ చాలామంది హీరోయిన్లు స్కిన్ ఫెయిర్ కోసం తీసుకుంటారని ఈషా గుప్తా తెలిపింది.

అందంగా కన్పించే విషయంలో హీరోయిన్‌లపై చాలా ఒత్తిడి ఉంటుందని..తన కూతురిని యాక్టర్ కానివ్వనని లేకపోతే తాను కూడా టీనేజ్ నుంచే అందంగా కన్పించే విషయమై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుందని వెల్లడించింది. సాధారణ జీవితం గడపలేదని తెలిపింది. తన కూతురు అథ్లెట్ కావాలనేది తన కోరికని చెప్పింది. చక్రవ్యూహ్, రాజ్ 3డి, రుస్తమ్, బాద్ షాహో వటి సినిమాల్లో ఈషా గుప్తా నటించింది. 2019లో చివరిసారిగా వెండితెరపై కన్పించిన ఈషా గుప్తా..ఆ తరువాత వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది.

Leave a Reply