సాంబలో ఆ ఒక్క సీన్ తీసి ఉంటే రికాడ్స్ బద్దలకొట్టేది..! వివి వినాయక్

వివి వినాయక్ VV Vinayak  ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆది సినిమా టాలీవుడ్‌లో సునామి సృష్టించింది. అది ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. టేకింగ్, మేకింగ్‌లో వివి వినాయక్ కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఆ తరువాత వచ్చిన దర్శకులెంతో మంది వివి వినాయక్ ఫార్మూలా ఉపయోగించి హిట్లు కొట్టారు. అయితే అలా ఆది సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన వినాయక్, ఎన్టీఆర్‌లు తరువాత తడబడ్డారు.

సాంబ సినిమాతో మరో సారి ప్రభంజనం సృష్టించేందుకు వచ్చారు.ఆ సమయంలో సాంబ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉండేవి. అయితే చదువు ముఖ్యమంటూ చెప్పిన పాయింట్ బాగానే ఉన్నా కూడా కథనం మాత్రం దెబ్బ కొట్టింది. మెయిన్ పాయింట్ చుట్టూ కథ తిరగకుండా యాక్షన్, ఫ్యాక్షన్ చుట్టే తిరిగింది. అందులోనూ మరీ దారుణమైన ఓ సీన్ పెట్టడంతో సినిమా బెడిసి కొట్టి ఉంటుందని వివి వినాయక్ VV Vinayak చెబుతుంటాడు.

సినిమాను సరిగ్గా గమనిస్తే ఆ సీన్ మీకే అర్థమవుతందంటూ తన సినిమాపై తానే సెటైర్ వేసుకుంటాడు.సాంబ సినిమాలో దారుణమైన రేp సీన్ ఉంటుంది.. అది తీయకుండా ఉంటే బాగుండేమో అని వివి వినాయక్ చెప్పుకొచ్చాడు. అయితే సాంబ సినిమా దారుణంగా బెడిసికొట్టినా ఆ తరువాత మళ్లీ ఈ కాంబోలో అదుర్స్ వంటి ఆల్ టైం సూపర్ హిట్ వచ్చింది. మొత్తానికి అలా దర్శకులు తమ సినిమాలను మళ్లీ తామే చూసుకున్నప్పుడు తప్పు ఎక్కడ జరిగి ఉంటుందో ఇట్టే పసిగట్టగలరు.

Leave a Reply