కళ్యాణ్‌రామ్‌ చేతిపై అమ్మాయి పేరు టాటూ.. ఆమె ఎవ‌రో తెలిస్తే షాకైపోతారు?

గత ఏడాది బింబిసార మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న క‌ళ్యాణ్ రామ్‌.. అమిగోస్ మాత్రం నిరసపరిచింది ఇక‌పోతే క‌ళ్యాణ్ రామ్ కుడి చేతిపై స్వాతి( అనే పేరు టాటూగా ఉంటుంది. అయితే ఈ టాటూ గురించి తాజా ఇంట‌ర్వ్యూలో క‌ళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కీ స్వాతి ఎవ‌రో కాదు.. క‌ళ్యాణ్ రామ్ అర్థాంగి.

ఇంత‌కీ భార్య పేరును ప‌చ్చ‌బొట్టుగా ఎందుకు వేయించుకున్నానో క‌ళ్యాణ్ రామ్ వివ‌రించాడు.`2007-08 మధ్య కాలంలో నేను తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాను. ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఆ టైమ్ లో స్వాతి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంది. నాకు ఒక త‌ల్లిలా సేవ‌లు చేసింది. తన కేరింగ్‌తో నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దింది. అది నా మనసుకు బాగా తాకింది.

నా భార్యపై ఉన్న ప్రేమతోనే తన పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాను. అసలు నేను ఇంజెక్షన్‌ చేయించుకోవాలన్న భయపడిపోయేవాడిని. కానీ ఆ భయాన్ని ఆమె మీద ఉన్న ప్రేమ అధిగమించేలా చేసింది. అలా ఆమె పేరు నా చేతి మీదకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే నా భార్య లేకపోతే నేను లేను` అంటూ క‌ళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఈయ‌న వ్యాఖ్య‌లు విన్న నెటిజ‌న్లు భార్య‌పై క‌ళ్యాణ్ రామ్ కు ఇంత ప్రేమ ఉందా అంటూ షాకైపోతున్నారు.

Leave a Reply