స్టైలిష్ విలన్ కు… స్టార్ హీరోయిన్ అంజలా జావేరికి ఉన్న సంబందం ఇదే..!

అంజలా జవేరి.. ఈ బ్యూటీ నార్త్ తో పాటు సౌత్‌ ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే. హిమాలయ్ పుత్రఅనే బాలీవుడ్ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కిన సూప‌ర్ హిట్ మూవీ ప్రేమించుకుందాం రాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత చూడాలని ఉంది, సమరసింహా రెడ్డి, దేవీ పుత్రుడు, రావోయి చందమామ, భలేవాడివి బాసు, ప్రేమసందడి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది.

టాలీవుడ్ లో చిరంజీవి, వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌, నాగార్జున.. ఇలా అప్ప‌టి స్టార్ హీరోలంద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. మ‌రోవైపు హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, త‌మ‌ళ భాష‌ల్లోనూ న‌టించింది. హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గిన త‌ర్వాత అడ‌పా త‌డ‌పా చిత్రాల్లో స‌హాయ‌క పాత్ర‌ల్లో మెరిసింది. తెలుగులో ఈమె చివ‌రిగా చేసిన చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో అంజలా జ‌వేరి క‌నిపించ‌లేదు.

ఇక‌పోతే అంజల జవేరి భ‌ర్త కూడా న‌టుడే. అత‌డో ఫేమ‌స్ విల‌న్. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు తరుణ్ అరోరా. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో తరుణ్ అరోరా తెలుగులో అడుగుపెట్టారు. ఫ‌స్ట్ మూవీతోనే విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఆపై కాటమ రాయుడు, జయ జానకి నాయక, అర్జున్ సురవరం, అమర్ అక్బర్ ఆంటోని వంటి చిత్రాల్లో న‌టించి స్టైలిష్ విల‌న్ గా గుర్తింపు పొందాడు.

తరుణ్ అరోరా, అంజలా జావేరి లది ప్రేమ వివాహం. దాదాపు 20 ఏళ్ళ పాటు ప్రేమించుకుని.. ఏడేళ్ల‌ క్రితమే పెళ్ళి చేసుకున్నారు. ఇంత వ‌ర‌కు వీరికి పిల్ల‌లు లేరు. ప‌ర‌స్ప‌ర అంగీకారంతో తరుణ్ అరోరా, అంజలా జావేరి పిల్ల‌ల‌ను వ‌ద్దు అనుకున్నార‌ట‌. ఇక వివాహం అనంత‌రం అంజలా జ‌వేరి.. న‌ట‌న‌కు దూర‌మైంది. అయితే ఆమె భ‌ర్త మాత్రం తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో అవ‌కాశాలు అందుకుంటూ స‌త్తా చాటుతున్నాడు.

Leave a Reply