Jabardasth Faima | జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది ఇప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. అందులో ఫైమా ఒకరు. పటాస్ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయ అయిన ఈ అమ్మడు.. తనదైన టైమింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.
ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ షో లో కూడా పాల్గొని దాదాపు 10 వారాలు హౌస్ లో అద్భుతమైన ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది. ఇక ఈ షోలో అడుగుపెట్టినప్పుడు తన తల్లి కోరికను బయటపెట్టింది ఫైమా. తాజాగా తన తల్లి కలను నెరవేర్చి.. కొత్తింట్లోకి గ్రాండ్ గా అడుగుపెట్టింది.ఇక త్వరలోనే జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. అద్భుతమైన ఇంటీరియల్ డిజైనింగ్ తో ఇల్లును పూర్తి చేసింది ఫైమా.
తాజాగా జరిగిన గృహ ప్రవేశానికి జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ తో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలు వచ్చి.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన ఫైమాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా తన తల్లిని పట్టుకుని ఏడ్చింది ఫైమా. ప్రస్తుతం ఫైమా పలు గేమ్ షోల్లో పాల్గొంటూ తన కెరీర్ ను కొనసాగిస్తోంది. మరి తన తల్లి కోరికను నెరవేర్చిన ఫైమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
- Prabhas Father | అచ్చం ప్రభాస్ లా ఉన్న ప్రభాస్ నాన్నని ఎప్పుడైనా చూసారా..!
- YS Sowbhagyamma | అవినాష్ పై వివేకానంద రెడ్డి భార్య ఎంపీగా పోటీ..? ఇంకా ఓటమి కాయం.
- MlA perni nani | పాపం జగన్ సభ కోసం బస్సు డ్రైవర్గా మారిన పేర్ని నాని..!