Sreeleela: శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తొలి చిత్రం ఏదో తెలుసా..?

ప్రస్తుతం తారాపథంలో దూసుకుపోతున్నది అచ్చ తెలుగు అందం శ్రీలీల. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. యువతరంలో ఈ భామకు తిరుగులేని ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. బుధవారం ఈ ముద్దుగుమ్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొనిఆమె నటిస్తున్న తాజా చిత్రాల తాలూకు కొత్త లుక్స్‌ను విడుదల చేశారు.

‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌బాబుతో జోడీ కడుతున్నది.ఈ సినిమా కొత్త స్టిల్‌లో ఈ సొగసరి సంప్రదాయ లంగావోణిలో మెరిసిపోతున్నది. ఇక బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్‌ కేసరి’ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో కూడా చూడముచ్చమైన అందంతో ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రాలతో పాటు నితిన్‌-వక్కంతం వంశీ మూవీ, బోయపాటి శ్రీను-రామ్‌ కాంబో చిత్రం, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, ఆదికేశవ, చిత్రాల్లో శ్రీలీల నాయికగా నటిస్తున్నది.

అది పక్కన పెడితే ప్రస్తుతం తెలుగులో శ్రీ‌లీల మొద‌టి సినిమా ఏది అంటూ ట‌క్కున పెళ్లి సంద‌D అనే చెప్పేస్తారు. కానీ, అది క‌రెక్ట్ కాదు. అవునండీ బాబు.. పెళ్లి సంద‌D కంటే ముందే శ్రీ‌లీల తెలుగులో చైల్ట్ ఆర్టిస్ట్ గా ఓ సినిమా చేసింది.ఆ మూవీ ఏదో గెస్ చేయ‌గ‌ల‌రా..? నాకు తెలిసి గూగుల్ సెర్చ్ చేయ‌కుండా మీరు క‌నిపెట్ట‌డం చాలా క‌ష్టం.

కాబ‌ట్టి మేమే చెప్పేస్తున్నాం.. చిత్రాంగద. 2017లో ఈ సినిమా వ‌చ్చింది. రాజోలు బ్యూటీ అంజ‌లి(Anjali) ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ను పోషించింది. జి. అశోక్ తెర‌కెక్కించిన ఈ థ్రిల్ల‌ర్ మూవీలో సాక్షి గులాటి, దీప‌క్‌, సింధు తులానీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

Leave a Reply