Devotional | పక్కింటోళ్ల‌ పూలతో పూజలు చేస్తారా…. అయితే ఇది తప్పక తెల్సుకోండి..!

allroudadda

Devotional | సాధారణంగా చాలామంది ప్రజలు పూజ( Puja ) చేసేటప్పుడు దేవుడికి పూలు సమర్పించడం చేస్తూ ఉంటారు.అయితే దేవుడి పూజ కోసం పూలను బయట మార్కెట్లో, లేదంటే బయట పెరట్లో పూసిన పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు.అయితే కొంతమంది పక్కింట్లో పూల చెట్టు ఉంటే వారిని అడిగి కోసుకొని వచ్చి పూజ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.అయితే ఎవరైతే భక్తి పూర్వకంగా పవిత్రమైన మనసుతో పుష్పాన్ని గాని,పండ్ల( Fruits )ను గాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దేవుడు తృప్తిగా స్వీకరిస్తాడని పండితులు చెబుతున్నారు.

చాలామంది తెలియకుండా దొంగ చాటుగా పూలు కోసుకొని వచ్చి భగవంతుని పూజిస్తూ ఉంటారు.ఎవరింట్లో వాళ్ళు కోసుకుంటే పర్వాలేదు.కానీ పక్కింట్లో ఉండే పూల చెట్టు( Flowers ) నుంచి ఒక్క పువ్వు కూడా వదలకుండా కొస్తుంటారు.ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు వద్దు అంటే వాళ్ళ వైపు కోపంగా చూస్తూ వీళ్ళకి దైవభక్తి కాస్త కూడా లేదంటూ మనసులో తిట్టుకుంటూ ఉంటారు.అయితే వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు.

allroudadda
allroudadda

దేవుని పూజ కోసం అని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి.మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం అని పండితులు చెబుతున్నారు.ఇక ఆ ఇంట్లో వాళ్ళని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం కిందికి వస్తుంది.ఇంకా చెప్పాలంటే పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానిని అడగాలి.అప్పుడు కూడా మీరు చేసే పుణ్యం లో సగం వారికి వెళ్తుంది.

Rajasekhar | పాపం హీరో రాజ‌శేఖ‌ర్ కెరీర్ నాశ‌నం అవ్వ‌డానికి కారణం ఇదే,

ఆ విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి.అలాగే తాంబూలం,పండ్లు దొంగతనం చేసిన వారు అడవిలో కోతిగా పుడతారని కూడా గరుడ పురాణంలో ఉంది.చెప్పులు, గడ్డి,పత్తి దొంగతనం చేసిన వారు మరో జన్మలో మేకలా పుడతారు.వాస్తవానికి పూజలు చేస్తూ పుణ్యం రావాలి.మోక్షం కలిగి వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి.కానీ ఆ ఇంటి యజమాని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజకు ఎటువంటి ఫలితాలు ఉండవు.

Recent Posts

Leave a Reply