Woman in AP | జగన్ శుభవార్త .. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం?

allroudadda.

Woman in AP | ఉచిత ప్రయాణం మొదట కర్ణాటకలో ఇది హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో సైతం ఇదే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా విజయం సాధించగలిగింది. ఇక ఇప్పుడు ఏపీలో ఈ హామీ తెరపైకి వచ్చింది. చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన ఆలోచనలు చేస్తోంది.

రెండో పెళ్లి చేసుకున్నా కాజల్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని.. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

allroudadda.
allroudadda.

పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోందని అన్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఈ తరుణంలో ప్రజలను ఆకట్టుకునేందుకు అక్కడి ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కార్యాచరణ చేపడుతున్నాయి.

 కేటీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!

అందులో మహాశక్తి పథకం ద్వారా టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎన్నికల ముందే ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది? రోజు వారీ ప్రయాణికుల్లో మహిళలు ఎంతమంది ఉంటారు? అనే అంశంపై జగన్ అధికారులను అరా తీసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఈ పథకాన్ని కొత్త ఏడాది రోజు లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply