రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి..!

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ హాస్యనటి, కితకితలు సినిమా హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నటి కరాటే కళ్యాణి ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘దయచేసి కార్ లో అయినా.. బైక్ లో అయినా జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు.. కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి యాక్సిడెంట్ వల్ల మృతి చెందారు ఓం శాంతి’ అంటూ పోస్ట్ పెట్టారు.

కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా.. వీరిలో గీతాసింగ్ పెద్ద కుమారుడు కూడా ఉన్నట్లు తెలిసింది.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గీతా సింగ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన అన్నయ్య కుమారులను ఆమె దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అన్నయ్య అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన ఇద్దరు పిల్లలకు అన్ని తానై దగ్గర ఉండి చూసుకుంటోంది. మరణించిన గీతా సింగ్ కుమారుడి పేరు, రోడ్డు ప్రమాద వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

దయచేసి కార్ లో అయినా బైక్ లో అయినా జాగ్రత్తగా
వెళ్ళండి పిల్లలు
కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి ఏక్సిడెంట్ వల్ల మృతి చెందారు😭ఓం శాంతి

గీతాసింగ్ నార్త్ ఇండియా నుంచి వచ్చి కుటుంబంతో కలిసి తెలంగాణలో సెటిల్ అయ్యారు. ఇక్కడే తెలుగు నేర్చుకుని.. ఆ తరువాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈవీవీ సత్యనారాయణ ఆమెకు అవకాశాలు ఇచ్చి బాగా ప్రోత్సహించారు.

ఎవడిగోల వాడిది సినిమాతో మంచి పేరు రాగా.. ఆ తరువాత అల్లరి నరేష్ సరసన కితకితలు మూవీలో హీరోయిన్‌గా నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఆమె ఇబ్బంది పడుతున్నారు.

​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

Leave a Reply