పాపులారిటీ కోసం బైక్ స్టంట్స్ చేసిన అమ్మాయిలు..! వైరల్ వీడియొ మీకోసం..

మొన్న ఆ మద్య మిధానీ డిపోకు చెందిన టీఎస్‌ఆర్టీసీ బస్సు 104-ఎ రూట్‌లో వెళుతుండగా ఓ యువకుడు ద్విచక్రవాహనం నడుపుతూ ఒక కాలుతో బస్సు వెనుకభాగాన్ని నెడుతున్నట్టుగా ఫోజులిచ్చాడు. ఈ ఘటనను వెనుక వస్తున్న మరో ద్విచక్రవాహనదారుడు వీడియో తీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు. సదరు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దంటూ ఘాటుగా హెచ్చరించారు.ఐతే తాజాగా ఇద్దరు అమ్మాయిల బైక్ స్టంట్ చేశారు. అంతంటితో ఆగలేదు.. ఏకంగా ఇద్దరూ అసభ్యంగా ప్రవర్తిస్తూ బైక్ స్టంట్ చేశారు.

ఇదంతా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవాలని ప్రాణాలకు మీదుకు తెచ్చుకుంటున్నారు. జరగరానిది జరిగితే ఇద్దరి పరిస్థితి ఏంటి.. ఇలాంటి వెర్రి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరు అమ్మాయిల స్టంట్ వీడియో తెగ వైరల్ అవుతోంది.దీనిపై మీ అభిప్రాయం కామెంట్ లో తెలియచెయ్యండి,

Leave a Reply