రాత్రికి రాత్రే రికార్డు స్థాయిలో వెళ్ళిన బంగారం ధర..! నేడు ఎంత అంటే,

Gold Rate Today: అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 1919.70 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. అదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు మాత్రం ఔన్సుకు 22.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 82.12 డాలర్ల వద్ద ఉంది.దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో భారీగా పడిపోయాయి.

అయితే ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో చూస్తే స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరల్లో పతనం కనిపించింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.100 పెరగ్గా రూ.53,950 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా రూ.100 పెరిగి ప్రస్తుతం 10 గ్రాములకు రూ.58,850 వద్ద ట్రేడవుతోంది.దిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది.

ఇక్కడ 10 గ్రాములకు రూ.100 చొప్పున పెరగ్గా 22 క్యారెట్ల గోల్డ్ రేటు Gold Rate Today: రూ. 54,100 వద్ద ఉండగా.. 24 క్యారెట్స్ బంగారం ధర మాత్రం రూ.59 వేల మార్కు వద్ద కదలాడుతోంది. బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి రేట్లు మాత్రం పతనం కావడం విశేషం.

వెండి రేటు హైదరాబాద్‌లో కిలోపై ఏకంగా రూ.5000 పతనం అయింది. ఆ తర్వాత 5 రోజుల వ్యవధిలో మరో 1700 పెరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ రెండు రోజులుగా పడిపోతోంది. క్రితం రోజు కిలోకు రూ.400 పడిపోగా.. ఇవాళ మరో రూ.500 పతనమై హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ.74,800 వద్ద కొనసాగుతోంది.

Leave a Reply