శుభవార్త.. తగ్గిన పసిడి.. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే..?

యూఎస్ ఫెడ్ హాకిష్ వైఖరి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా పతనమై మూడు నెలల కనిష్టానికి పడిపోయింది.ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర ₹ 200, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 220 చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ₹ 1,000 పతమైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,500 కి చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు కూడా రూ.100 పడిపోయి.. రూ.60,450 వద్ద ట్రేడవుతోంది. జూన్ 10న కూడా గోల్డ్ రేటు రూ.100 పతనమైంది. దేశ రాజధాని దిల్లీలోనూ బంగారం రేటు తాజాగా తగ్గింది. అక్కడ 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు రూ.100 తగ్గి రూ.55,550 వద్ద ఉండగా.. 24 క్యారెట్స్ బంగారం రేటు రూ.100 పడిపోయి రూ.60,600 వద్ద కొనసాగుతోంది.

బంగారంతో పాటే వెండి ధర కూడా హైదరాబాద్, దిల్లీ మార్కెట్లలో భారీగా తగ్గింది.హైదరాబాద్‌లో కిలో వెండి రేటు తాజాగా రూ. 500 తగ్గి రూ.79,300 వద్ద ఉంది. ఇక దిల్లీలోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఇవాళ అక్కడ రూ.200 తగ్గి.. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 74,300 వద్ద ఉంది. బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గినప్పటికీ ప్రస్తుతం ఇంకా గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ఇవి ఎక్కువగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటాయి.

అక్కడ వడ్డీ రేట్లు పెరిగితే.. బంగారం ధర పడిపోతుంటుంది. అదే వడ్డీ రేటు తగ్గితే మాత్రం.. బంగారం రేటు పెరుగుతుంటుంది.ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చూసుకుంటే బంగారం రేటు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1958 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్‍‌తో చూస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 82.408 వద్ద ఉంది.

Leave a Reply