Gorantla Madhav

Gorantla Madhav | జాతీయ మీడియాతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంగ్లిష్ మాట్లాడటం చూస్తే నవ్వుకుంటారు..

Gorantla Madhav | హిందూపుర్‌ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌(Gorantla Madhav) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయనో పోలీస్‌ అని అందరికి తెలిసిందే. గతంలో ఏదో(***) వీడియో వ్యవహారంలోనూ గోరంట్ల పేరు ఇండియా వ్యాప్తంగా మారుమోగింది. ఇలా ఏం చేసినా తనదైన శైలీలో టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారుతుంటారు గోరంట్ల. అనంతపురం పోలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ తనలో ఇంకా పోలీస్‌ బతికే ఉన్నాడని దేశానికి చూపించాడు.

లోక్‌సభ (indian parliament) జీరో అవర్‌లో ఇద్దరు ఆగంతకులు లోపలికి చోరబడ్డ మేటర్‌ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతుండగా.. ఆ నిందితులను ఎంపీలు పట్టుకున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.ఆ సమయంలో గోరంట్ల మాధవ్ కూడా అక్కడే వున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సభలో కుర్చీల మీదికి ఎక్కి నిందితుడు వున్న వైపు చేరుకున్న మాధవ్ అతనిని చితకబాదారు.

Gorantla Madhav | లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సాహసం.. 

అతని చేతులు వెనక్కి విరిచి కట్టి, భద్రతా సిబ్బందికి అప్పగించారు. అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. కిందకి దూకిన వెంటనే అగంతకులు స్మోక్ బాంబును విసిరారని, దీని వల్ల ఎదురుగా ఏం వుందో కనిపించనంతగా పొగ కమ్ముకుందన్నారు. నిందితుడు బెల్ట్ బాంబును నడుముకు కట్టుకుని వుంటాడనే అనుమానంతో అతనిని తనిఖీ చేశానని గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వెల్లడించారు.

Also Read : యానిమల్ కోసం జిమ్‌లో ర‌ణ్‌బీర్.. తప్పక చూడాల్సిన వీడియో..

నిందితుల పథకాన్ని, కుట్రను భగ్నం చేసేలా ఎంపీలు ధైర్యంగా ఎదుర్కొన్నారని మాధవ్ ప్రశంసించారు. గతంలో తాను సీఐగా పనిచేసిన అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని ఆయన వెల్లడించారు. తమ ధన, మాన, ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఒక పోలీస్ అధికారిగా పనిచేయాల్సిన అవసరం వుందని గోరంట్ల మాధవ్ చెప్పారు. ఈ ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని పార్లమెంట్‌లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Also Read : పని మనిషికి జీతం రెండు కోట్ల కానీ షరతులు ఏంటంటే..?

Leave a Reply